తొట్టెంపూడి వేణుకు పితృవియోగం

సినీ నటుడు తొట్టెంపూడి వేణు పితృవియోగానికి గురయ్యారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) ఈ రోజు (29.01.2024) తెల్లవారుజామున పరమపదించారు. తొట్టెంపూడి వెంకట సుబ్బారావు భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9.00 గంటలు నుండి మధ్యాహ్నం 12.00 ల మధ్య స్వగృహం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ నందు ఉంచనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గం. 12.30 తర్వాత జూబ్లీహిల్స్, మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వేణు విషయానికి వస్తే.. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలలో హీరోగా నటించి సక్సెస్‌ను అందుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన కెరీర్ అంతగొప్పగా ఏం లేదు. హీరోగా ఆయన చేసిన సినిమాలు వరసగా పరాజయాలు పొందడంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఈ మధ్యనే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒరిజినల్ అతిథి సిరీస్‌తో ఆయన డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. మళ్లీ ఆయన కెరీర్ ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో ఆయన తన తండ్రిని కోల్పోవడం బాధాకరమనే చెప్పాలి.
తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నటుడు వేణుకు ధైర్యం చెబుతున్నారు.
Venu Thottempudi Father Venkata Subbarao No More
Venu Thottempudi Father Venkata Subbarao Passed Away






































