69th FilmFare Awards: యానిమల్‌కే!

69th FilmFare Awards Winners List69th FilmFare Awards Winners List

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్​ఫేర్ అవార్డుల ప్రకటన వచ్చేసింది. 69వ ఫిల్మ్​ఫేర్ అవార్డుల వేడుకకు గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికైంది. 2023లో విడుదలైన ఆయా సినిమాలకు సంబంధించి ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. 2023కిగానూ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ యానిమల్ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, అతని భార్య ఆలియా భట్‌ రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇటీవల విడుదలై బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచిన 12th ఫెయిల్‌ చిత్రం ఉత్తమ చిత్రం కేటగిరి అవార్డును గెలుచుకుంది. ఇంకా 2023 సంవత్సరానికిగానూ ఆయా కేటగిరీల్లో అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే..

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌

ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే జరా హత్కే జరా బచ్కే)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌

ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

అయితే ఈ అవార్డుల విషయంలో సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రానికి, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, డంకీ సినిమాల నుండి గట్టి పోటీ ఉంటుందని మొదటి నుండి అంతా భావించారు కానీ.. ఆ రెండు చిత్రాలు ఈ అవార్డుల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. 12 th ఫెయిల్ చిత్రం మాత్రం సందీప్‌కు, షారుఖ్‌కు గట్టిపోటీని ఇచ్చి మ్యాగ్జిమమ్ అవార్డులను కైవసం చేసుకుంది.

Animal and 12th Fail Movies got Maximum Awards in 69th FilmFare Awards

69th filmfare awards