జనసేన MLA అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్!

సోషల్ మీడియాలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యుర్థుల మొదటి జాబితా అంటూ.. 21 మందితో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. జనసేన పార్టీ నుండి ఇంత వరకు అధికారికంగా ఎటువంటి లిస్ట్ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం 21 మంది అభ్యుర్థుల పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ల మధ్య చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. సీట్ల గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ, అభ్యర్థుల జాబితా అంటూ ఈ లిస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లుగా ఉంటే.. నిర్మాత బన్నీ వాసు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి అసలు లిస్ట్ రావడానికి టైమ్ ఉందిలే కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచరిస్తున్న జాబితాపై ఓ లుక్ వేస్తే..
1. నెల్లిమర్ల- లోకం నాగ మాధవి
2. గజపతిపురం- పడాల అరుణ
3. గాజువాక- సుందరపు సతీష్
4. భీమిలి- పంచకర్ల సందీప్
5. పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు,
6. ఎలమంచిలి- సుందరపు విజయ్ కుమార్
7. ముమ్మిడివరం- పీతాని బాలకృష్ణ
8. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ
9. రాజమండ్రి రూరల్- కందుల దుర్గేష్
10. కాకినాడ రూరల్- పంతం నానాజీ
11. పిఠాపురం- ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాస్)
12. రామచంద్రపురం- చిక్కం దొరబాబు
13. జగ్గంపేట- పాలెంశెట్టి సూర్యచంద్రరావు
14. రాజోలు- డిఎంఆర్ శేఖర్
15. భీమవరం- కొణిదల పవన్ కళ్యాణ్
16. తణుకు- విడవడ రామచంద్రరావు
17. తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
18. నరసాపురం- బొమ్మిడి నాయకర్
19. విజయవాడ వెస్ట్- పోతిన మహేష్
20. తెనాలి- నాదెండ్ల మనోహర్
21. గిద్దలూరు- ఆమంచి శ్రీనివాసరావు
Social Media Eye on Janasena Party MLA Candidates List
Janasena Party MLA Candidates List 2024 Goes Viral






































