ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొద్దిరోజులుగా లుక్ విషయంలో తీవ్రవిమర్శల పాలవుతున్నారు. బాహుబలిలో రాజసం చూపించిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో లుక్ విషయంలో ఫాన్స్ ని, ప్రేక్షకులని డిస్పాయింట్ చేస్తూ వస్తున్నారు. సలార్ లో మాస్ లుక్ లో దేవా గా ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు సలార్ ప్రమోషన్స్ లో తన కొత్త లుక్ తో మరింత ఇంప్రెస్స్ చేసారు. ప్యాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో సలార్ హీరో ప్రభాస్, విలన్ పృథ్వీ రాజ్ సుకుమారన్,ప్రశాంత్ నీల్ లు నిన్న శుక్రవారం కామన్ ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించి ఫిదా చేసారు.
సలార్ ఫస్ట్ టికెట్ ని ఎస్.ఎస్. రాజమౌళి కొనుగోలు చేసారు. సలార్ తోలి టికెట్ ని 10,116 కి కొన్న రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో ప్రచారమైతే జరుగుతుంది. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ప్రభాస్ కొత్త లుక్ చూసి ఇలా కదా మేము ప్రభాస్ ని చూడాలనుకుంది అంటూ ప్రభాస్ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి అలాగే సలార్ టీమ్ కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రేపు శుక్రవారం విడుదలకాబోతున్న సలార్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో మైత్రి మూవీస్ వారు కొనుగోలు చేసారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ లో భాగంగానే ప్రభాస్ అండ్ కో రాజమౌళితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.