బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోయారా.. నిజమే విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వండి వరిస్తుంది. ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం తన కుమర్తె ని తీసుకుని భర్త, అత్తమామల ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి తన తల్లితో కలిసి ఉంటుంది అనే న్యూస్ గుప్పుమంది. గత కొన్నేళ్లుగా ఐష్ కి అభిషేక్ కి మధ్యన విభేదాలు ఉన్నాయి, విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరిగినా ఇంత గట్టిగా ఎప్పుడూ మీడియాలో కనిపించలేదు, కానీ ఈసారి ఐశ్వర్య అత్తమాల నుండి, భర్త నుండి వేరైపోయింది అంటూ ఇంగ్లీష్ డైలీలో వస్తున్న వార్తలు చూసి బచ్చన్ అభిమానులు, ఐష్ అభిమానులు షాకవుతున్నారు.
కొన్నాళ్లుగా అత్త జయ బచ్చన్ కి ఐశ్వర్య రాయ్ కి మాటల్లేవు అని, భర్తతో మనస్పర్థలు సర్దుకోక పోగా ఇంకా ఎక్కువయ్యాయని, ఇలాంటి గొడవలు మధ్యన తన కుమార్తె ఆరాధ్య పెరగడం ఇష్టం లేకపోవడంతోనే ఐశ్వర్య బచ్చన్ కుటుంబాన్ని వదిలి ఒంటరిగా వచ్చింది అంటూ ఆ వార్త పత్రిక ప్రచురించింది. అత్తమామలతో, భర్తతో పొసగడం లేదు, ఈ విభేదాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి కానీ, తగ్గకపోవడంతోనే ఐష్ తన తల్లి సలహాతో బచ్చన్ ఫ్యామిలీని, భర్తని వదిలేసినట్లుగా ఆ పత్రిక ముద్రించింది.
ప్రస్తుతం భర్త కుటుంబంతో ఐష్ దూరంగా ఉంటున్నప్పటికీ భర్తకి ఇప్పుడప్పుడే విడాకులు ఇచ్చే ఆలోచన లేనట్లుగా చెబుతున్నారు. తన కూతురు ఆరాధ్యకు తండ్రి ప్రేమ కూడా అవసరం కాబట్టే ఐష్ విడాకులు తీసుకోవడం లేదు అని రకరకాలుగా ఆ పత్రిక ప్రముఖంగా ముద్రించింది.
కానీ ఐష్-అభిషేక్ లు ఈ విడాకుల పుకార్లకు బలంగానే ఫుల్ స్టాప్ పెట్టారు. బాలీవుడ్ లో జరిగిన అంబానీ స్కూల్ ఈవెంట్ కి ఐశ్వర్య రాయ్ తన తల్లి బృందారాయ్‌తో కలిసి కారులో వచ్చారు. అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, మేనల్లుడు అగస్త్య నందాతో కలిసి ఆ ఈవెంట్ కి వచ్చారు. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ అభిషేక్ తో కలిసి నడుస్తూ ఓ వీడియోలో కనిపించింది. అభిషేక్, అగస్త్య నందా, అమితాబ్ ఈ వేదిక వద్ద ఐశ్వర్యారాయ్‌తో కలిసి వెళ్లారు. అదే వేడుక వద్ద అభిషేక్ అక్కడ తన భార్య ఐశ్వర్య రాయ్‌తో మాట్లాడుటూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరి ఇది చూస్తే వీరిపై వస్తున్న పుకార్లకు ఈ స్టార్ కపుల్ పర్ఫెక్ట్ గా చెక్ పెట్టినట్లే అనిపిస్తుంది.