పెళ్లి రూమర్స్ పై త్రిష రియాక్షన్

గత కొద్దిరోజులుగా త్రిష పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చెన్నై కి చెందిన వ్యాపారవేత్తని వివాహం చేసుకోవాలని పెద్దలు చూపించిన అతనితో ఏడడుగులు నడిచేందుకు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న త్రిష తర్వాత కెరీర్ గురించి అలోచించి ఆ నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత ఇన్నాళ్లకి త్రిష ఓ మలయాళ నిర్మాతని ఇష్టపడింది. అతనితో త్వరలోనే త్రిష పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది.
అయితే ఆ వార్తలు త్రిషకి చేరడంతో త్రిష తాజాగా తన పెళ్లి వార్తలు పుకార్లేనని కొట్టి పడేసింది. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలంటే కేపిటల్ లెటర్స్ తో DEAR YOU KNOW WHO YOU ARE AND YOUR TEAM, KEEP CALM AND STOP RUMOURING CHEERS ప్రశాంతంగా ఉండండి.. ఈ పెళ్లి పుకార్లని ఆపండి కూల్ అంటూ ట్వీట్ చేసింది.
దానితో త్రిష పెళ్లి వార్తలకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే. మరి త్రిష ఇప్పట్లో పెళ్లి చేసుకోదేమో.. ఆమె పెళ్లి పై వస్తున్న న్యూస్ లన్ని పుకార్లే అని క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Trisha on Wedding Rumours
Trisha reaction on marriage rumours






































