రవితేజ ప్యాన్ ఇండియా మూవీ చిక్కుల్లో పడిందా అంటే అవుననే అనిపిస్తుంది. ఏపీ హై కోర్టులో టైగర్ నాగేశ్వరావు పై కేసు ఫైల్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు టీజర్ లో కొన్ని డైలాగ్స్ ఒక సామజిక వర్గాన్ని కించ పరిచేవిలా ఉన్నాయని, స్టువర్టుపురం ప్రాంతవాసుల మనోభావాలు ఆ డైలాగ్స్ దెబ్బతీసేవిలా ఉన్నాయంటూ చుక్కా పాల్ రాజ్ హై కోర్టులో పిల్ వేసాడు. దానితో విచారణ జరిపిన కోర్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నోటీసులు పంపింది.
సెంట్రల్ బోర్డు సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా.. ఇలాంటి టీజర్ విడుదల చేసి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని డైలాగ్స్ ఎరుకల సామజిక వర్గాన్ని కించపరిచేవిలా, స్టూవర్టుపురం ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతినేవిలా ఉన్నాయంటూ కోర్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నోటీసులు జారీ చేసింది.
రీసెంట్ గానే విడుదలైన టైగర్ నాగేశ్వరరా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. అక్టోబర్ 20 న విడుదలవుతున్న ఈ చిత్రం అసలు సిసలైన ప్యాన్ ఇండియా కంటెంట్ అంటూ పేక్షకులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. రవితేజ ఈ చిత్రం తో పక్కా హిట్ కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు ధీమాగా కనబడుతున్న సమయంలో ఈ కేసు ఎలాని మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.