Advertisement

రామ్ తో బేబీ హీరోయిన్.. తూచ్ అంటగా

Sun 06th Aug 2023 02:19 PM
vaishnavi chaitanya  రామ్ తో బేబీ హీరోయిన్.. తూచ్ అంటగా
Baby heroine with Ram, It is only a gossip రామ్ తో బేబీ హీరోయిన్.. తూచ్ అంటగా
Advertisement

బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లక్కీ.. బేబీ చిత్రం సక్సెస్ తర్వాత ఆమెకి ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. అందులో ఆమె గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే మూడు ఫిలిమ్స్ కి సైన్ చేసింది. అందులో ఒకటి అల్లు శిరీష్ హీరో అంటూ ప్రచారం జరిగింది. కానీ వాటిలో ఎంతవరకు నిజం ఉందొ క్లారిటీ లేదు. అయితే గత రెండు రోజులుగా వైష్ణవి చైతన్య కి హీరో రామ్ తో రొమాన్స్ చేసే బిగ్ ఛాన్స్ వచ్చేసినట్లుగా చెప్పారు. బేబీ హిట్ అయ్యాక రామ్ నుండి వైష్ణవి చైతన్యకి కాంప్లిమెంట్స్ దక్కడంతో అందరూ అదే న్యూస్ నిజమనుకుంటున్నారు. 

పూరి జగన్నాథ్-రామ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లో రామ్ సరసన వైష్ణవి చైతన్య సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు.. రామ్ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నది అనేది నిజం కాదని.. ఇవ్వని ఒట్టి గాసిప్స్ మాత్రమే అంటూ మరొక న్యూస్ బయటికొచ్చింది. 

అంటే వైష్ణవి కి రామ్ తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది అనేది జస్ట్ రూమర్ అని తేలిపోయింది. మరి బేబీ తర్వాత వైష్ణవి చైతన్య చెయ్యబోయే కొత్త ప్రాజెక్ట్ పై అందరిలో క్యూరియాసిటీ కనబడుతుంది. 

Baby heroine with Ram, It is only a gossip:

Vaishnavi Chaitanya romance to Ram, It is only a gossip

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement