Advertisement

ఛాన్స్ కోసం వెయిటింగ్: ఎన్టీఆర్ హీరోయిన్

Fri 14th Jul 2023 01:19 PM
ankitha   ఛాన్స్ కోసం వెయిటింగ్: ఎన్టీఆర్ హీరోయిన్
Waiting for a good chance: NTR heroine ఛాన్స్ కోసం వెయిటింగ్: ఎన్టీఆర్ హీరోయిన్
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రిలో వన్ అఫ్ ద హీరోయిన్ గా నటించిన అంకిత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా అమెరికాలో రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్ లో మంచి మంచి సినిమాల్లో నటించినా ఆమె టాప్ పొజిషన్ కి చేరుకోలేకపోయింది.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉన్న తరుణంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాను.. మంచి ఛాన్స్ వస్తే సినిమాల్లోకి వస్తానంటూ చెప్పింది.

తనకి బాలకృష్ణతో నటించిన విజయేంద్ర ప్రసాద్ డిసాస్టర్ నన్ను చాలా బాధించింది, ఆ సినిమా హిట్ అవుతుంది అని నమ్మాను అంటూ చెప్పిన అంకిత హీరో నవదీప్ తో క్లాషెస్ గురించి వివరణ ఇచ్చింది. తనకి నవదీప్ కి ఎలాంటి గొడవ జరగలేదని.. కానీ నవదీప్ తో మనసు మాట వినదు మూవీ సమయంలోనే తమిళంలో మరో మూవీ చెయ్యాల్సి రావడంతో కాస్త ప్రస్టేట్ అయ్యేదాన్ని, తీవ్ర వత్తిడికి లోనెయ్యే దానిని, అంతేకాని.. తనకి నవదీప్ కి మధ్యలో ఎలాంటి క్లాష్ రాలేదు అంటూ అంకిత చెప్పుకొచ్చింది. 

అయితే విజయేంద్ర ప్రసాద్ గనక సక్సెస్ అయినట్లయితే తాను సినిమాలని కంటిన్యూ చేసేదానిని, కానీ అది ప్లాప్ రావడంతోనే సినిమాలకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది అంటూ అంకిత అసలు విషయం రివీల్ చేసింది. ప్రస్తుతం తాను మంచి ఛాన్స్ వస్తే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టేందుకు రెడీగా అవుతున్నట్లుగా ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Waiting for a good chance: NTR heroine:

Simhadri Actress Ankitha Shares Why She Quit From Movies

Tags:   ANKITHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement