Advertisementt

బిచ్చగాడు 2 ఓవర్సీస్ టాక్

Fri 19th May 2023 09:21 AM
bichagadu 2 overseas talk  బిచ్చగాడు 2 ఓవర్సీస్ టాక్
Bichagadu 2 Overseas talk బిచ్చగాడు 2 ఓవర్సీస్ టాక్
Advertisement
Ads by CJ

బిచ్చగాడుతో అందరి చూపు తనపైన పడేలా చేసుకోవడమే కాదు ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన విజయ్ ఆంటోని.. ఆ తర్వాత ఈ ఐదేళ్లలో ఆరు సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేసే విజయ్ ఆంటోని ఈసారి బిచ్చగాడు సీక్వెల్ తో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తెలుగులో యావరేజ్ ప్రమోషన్స్ తో సరిపెట్టకుండా భారీగా సినిమాని ప్రమోట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేసాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బిచ్చగాడు 2 ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి.

బిచ్చగాడు 2 ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. విజయ్ ఆంటోనీ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. సినిమా మొదలై 50 నిమిషాలు అయిపోయింది. మొదటి 20 నిమిషాలు అద్భుతంగా ఉంటే.. మిగతాదంతా ఫ్లాట్‌గా సాగిపోయింది అంటూ ఆడియన్స్ కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ వన్ మ్యాన్ షో చేశాడు. కొత్త పాయింట్ లేకుండా రొటీన్ ఫ్లాట్‌తోనే సాగింది, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. 

కానీ స్టోరీ పెద్దగా లేకపోవడం.. రొటీన్ సీన్స్ ఉండడం మైనస్‌ అని చెప్పవచ్చని మరొకొందరి మాట. ఫస్టాఫ్ కాస్త ఎంగేజింగ్‌గానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన రీతిలో లేదని కొందరు, ఎమోషన్స్ బలంగా లేవని కూడా మరికొందరు అంటున్నారు.. ఫైనల్ గా బిచ్చగాడు 2 కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ అయితే స్ప్రెడ్ అయ్యింది.

Bichagadu 2 Overseas talk:

Bichagadu 2 Overseas public talk

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ