పవన్ కళ్యాణ్ వీరమల్లుకి అన్యాయం చేస్తున్నారా? అందుకే హరి హర వీరమల్లు దర్శకనిర్మాతలు కామ్ గా కనిపిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. గత ఏడాది దసరాకి హరి హర వీరమల్లు వర్క్ షాప్ అంటూ హడావిడి చేసిన క్రిష్ - పవన్ కళ్యాణ్ లు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఓ 45 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ చేసారు. ఆ తర్వాత హరి హర వీరమల్లు సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ వెళ్లనేలేదు. ఈలోపు బ్రో షూటింగ్ ఫినిష్ చేసారు.
ఇక తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్-OG షూటింగ్ మధ్యన పవన్ కళ్యాణ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్, OG మొదటి షెడ్యూల్స్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇంకేంటి హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళ్ళిపోతారని అనుకుంటే ఇపుడు మరోసారి OG సెట్స్ లోకి వెళ్లారు. హైదరాబాద్ లో ఈరోజు నుండే సెకండ్ షెడ్యూల్ మొదలయ్యింది. తదుపరి ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ కి వెళతారని తెలుస్తుంది.
ఇలా అయితే పవన్ కళ్యాణ్ వీరమల్లుని పక్కనబెట్టేసారా? అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ అయ్యారా? ఎప్పుడో జనవరి 26 న వీరమల్లు టీజర్ అన్నవారు ఇంతవరకు హరి హర వీరమల్లు అప్ డేట్ ఇవ్వడం లేదు.. అబ్బో ఇన్ని అనుమానాల మధ్యన పవన్ కళ్యాణ్ వీరమల్లు ఆగిపోయింది అనే డౌట్ కూడా కొడుతోంది.




ఫైనల్లీ దీక్ష విరమించిన లైగర్ బయ్యర్లు 

Loading..