Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Roja Ramani Clarifies About her son Tarun Marriage

రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లవర్ బాయ్

Roja Ramani Clarifies About her son Tarun Marriage

టాలీవుడ్ లోకి లవర్ బాయ్ లా ఎంట్రీ ఇచ్చి.. అదే లవ్ స్టోరీస్ తో ఫెమస్ అయిన హీరో తరుణ్ గత కొన్నేళ్లుగా వెండితెర మీద కనిపించకుండా పోయాడు. ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపిన తరుణ్.. ఆ తర్వాత బ్రేకప్ చేసుకున్నారు అనే వార్త విపరీతంగా వినిపించింది. తరుణ్ తో ప్రేమ, బ్రేకప్ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ లో ఇబ్బంది పడింది, తరుణ్ కూడా బిగ్ బ్యానర్ లో సినిమాలు చేసినా సక్సెస్ లేక కనుమరుగయ్యాడు. 

మధ్య మధ్యలో సెలెబ్రిటీ క్రికెట్ లో కనిపించే తరుణ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. అతి త్వరలోనే తరుణ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు, ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం ఆయన తల్లి రోజారమణి స్పష్టం చేసారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తరుణ్ రీ ఎంట్రీకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకటి సినిమా అయితే .. మరొకటి వెబ్ సిరీస్. 

ముందుగా సినిమా నా, లేదంటే వెబ్ సీరీస్ పూర్తవుతుందనేది చూడాలి. తనని ఇంతకుముందు మాదిరిగానే ప్రేక్షకులు ఆదరించాలనీ కోరుకుంటున్నాను. అలాగే తరుణ్ కి త్వరలోనే పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను అంటూ రోజారమణి గారు కొడుకు రీ ఎంటర్ పై, పెళ్లి పై స్పందించారు.

Roja Ramani Clarifies About her son Tarun Re Entry

roja ramani
tarun