Advertisement

సైలెంట్ గా ఓటిటిలోకి రావణాసుర

రవితేజ రీసెంట్ మూవీ రావణాసుర ఏప్రిల్ 7 న విడుదలై అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలు హిట్ అవడంతో రవితేజ రావణాసురపై అంచనాలు వచ్చేసాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ-సుశాంత్ నటించిన ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవ్వుద్ది అనుకున్నారు. కానీ రవితేజకి హీరోగా, నిర్మాతగానూ రావణాసుర భారీ షాకిచ్చింది. థియేటర్స్ లో రెండోరోజే రావణాసుర బండారం తేలిపోయింది. 

ఇక థియేటర్స్ లో విడుదలైన మూడు వారలు తిరక్కుండానే ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. రావణాసుర డిజిటల్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సైలెంట్ గా అంటే ఎలాంటి హడావిడి లేకుండానే రావణాసురుని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసారు. ఈ రోజు అంటే ఏప్రిల్ 28 నుండి రావణాసుర అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్స్ లో ప్లాప్ అయిన రావణాసుర ఓటిటి పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి!

Ravi Teja Ravanasura is now streaming

Ravanasura silently entered the OTT
ravi teja
ravanasura