ఈ వారం విడుదలవుతున్న చిత్రాల లిస్ట్

వారం వారం కొత్త కొత్త సినిమా రిలీజ్ లతో ప్రేక్షకులు రిలాక్స్ అవుతూ ఉంటే.. బాక్సాఫీసు మాత్రం కళకళలాడుతుంది. గత వారం రావణాసుర, మీటర్ మూవీస్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులని నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఫీవర్ నుండి బయటికి వచ్చేసారు. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాగా రేపు మంగళవారంతో 10th ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అవడంతో.. స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంతా కొత్త సినిమాలు ఏమోస్తున్నాయో అని తెగ వెతికేస్తున్నారు. 

ఇక ఈ శుక్రవారం సమంత సోలో చిత్రం శాకుంతలం పాన్ ఇండియా మూవీగా ఐదు భషాల్లో ఏప్రిల్ 14 న రిలీజ్ కి రెడీ అయ్యింది. అదే రోజు తమిళం నుండి రాఘవ లారెన్స్ రుద్రుడు, ఏప్రిల్ 15న తమిళంలో సూపర్ హిట్ అయిన విడుదల చిత్రం తెలుగులో డబ్బింగ్ మూవీగా విడుదలకు రెడీ అయ్యింది.

వీటితో పాటుగా పలు ఓటిటీలలో కొత్త చిత్రాలు, అలాగే థియేటర్స్ లో విడుదలైన చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కి రానున్నాయి.

మార్చ్ 22 ఉగాది రోజున థియేటర్స్ లో విడుదలైన విశ్వక్ సేన్ మాస్ క ధమ్కీ ఏప్రిల్ 14 న ఆహా ఓటిటి నుండి అందుబాటులోకి రానుంది. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి ఓ కల డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానుంది.

ఇక మిగతా ఓటిటీస్ నుండి హిందీ, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు తో పాటుగా.. కొన్ని ఆసక్తికర వెబ్ సీరీస్ లు కూడా ఏప్రిల్ 14 నుండి ప్రేక్షకులకి అందుబాటులోకి రాబోతున్నాయి.

This week theaters and OTT release movies

List of movies releasing this week
theaters
ott