NBK108 సెట్స్ లో శ్రీలీల

Sreeleela on the sets of NBK108Sreeleela on the sets of NBK108

యంగ్ బ్యూటీ, లక్కీ హీరోయిన్ శ్రీలీల జోరు గురించి పదే పదే చర్చకు వస్తూనే ఉంది. ఎందుకంటే శ్రీలీల కి టాలీవుడ్ ఆఫర్స్ వెల్లువ అలా ఉంది మరి. ఏ యంగ్ హీరో చూసినా శ్రీలీల మాయలోనే కనబడుతున్నారు. ప్రస్తుతం ఏడెనిమిది ప్రాజెక్ట్స్ తో బిజీ తారగా మారిన శ్రీలీల ఈమధ్యనే బాలకృష్ణతో చేస్తున్న NBK108 సెట్స్ లో జాయిన్ అయ్యింది. కాజల్ తో ఈ చిత్రంలో స్క్రీన్ చేసుకోబోతున్న శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనబడుతుందా.. లేదంటే మరో హీరోయిన్ గా బాలయ్య పక్కన కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

అయితే రీసెంట్ గా NBK108 సెట్స్ లో జాయిన్ అయిన శ్రీలీల అక్కడి సెట్స్ లో గ్రాడ్యుయేట్ MLC కంచర్ల శ్రీకాంత్ ఫామిలీతో కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పిక్ లో శ్రీలీల క్యూట్ గా ట్రెడిషనల్ గా అందంగా కనిపిస్తుంది. NBK108 లో శ్రీలీల లుక్ పై, ఆమె కేరెక్టర్ పై అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి శ్రీలీల ని ఎలా ప్రెజెంట్ చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఉంది.  

అలంటి సమయంలో శ్రీలీల పిక్ NBK108 నుండి బయటికి రావడంతో దానిని ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు ఫాన్స్. ఇక శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తుంది.

Sreeleela in NBK108 sets

sreeleela
nbk108