ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Eesha Rebba glitters in her latest clicks

బ్యూటిఫుల్ ఈషా రెబ్బా

తెలుగమ్మాయి ఈషా రెబ్బా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రాకపోయినా.. యంగ్ హీరోల సినిమాల్లో నటించి.. ట్రెడిషనల్ నుండి గ్లామర్ గా టర్న్ అయిన ఈషా రెబ్బ ప్రస్తుతం అవకాశాలు కోసం వెయిట్ చేస్తుంది. మొన్నామధ్యన ఈషా రెబ్బ పెళ్లి పీటలెక్కుతుంది అన్నప్పటికీ అది రూమర్ అని తేలిపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా గ్లామర్ ఫోటోషూట్స్ ని షేర్ చేస్తున్న ఈషా రెబ్బ ఈమధ్యన వాటికి కూడా గ్యాప్ ఇచ్చింది.

కొన్నాళ్లుగా సోషల్ మీడియా లోను యాక్టీవ్ గా కనిపించడం లేదు. గ్లామర్ షూట్స్ కానీ, జిమ్ లో వర్కౌట్స్ వీడియోస్ కానీ షేర్ చెయ్యడం లేదు. దానితో ఈషా రెబ్బ ఫాన్స్ బెంగపెట్టుకున్నారు. ఈమధ్యనే సారీ లుక్ పోస్ట్ చేసిన ఈషా రెబ్బ తాజాగా బెంగుళూరు టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో గ్లామర్ గా హొయలు పోవడమే కాదు.. బ్రైట్ గా మెరిసిపోయింది కూడా. 

క్రీమ్ కలర్ లెహంగా లో బ్యూటిఫుల్ గా ఇచ్చిన ఫోజులకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగమ్మాయి.. ఇంత అందంగా ఉంటే.. ఒక్కరూ ఛాన్స్ ఇవ్వరే అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Eesha Rebba latest clicks from Bangalore Times Fashion Week event

Eesha Rebba glitters in her latest clicks
eesha rebba
bangalore times fashion week event