Advertisementt

నెక్స్ట్ టార్గెట్ ఎవరు రెడ్డిగారు

Wed 01st Feb 2023 12:23 PM
gopichand malineni,balakrishna  నెక్స్ట్ టార్గెట్ ఎవరు రెడ్డిగారు
Gopichand Malineni Next Hero? నెక్స్ట్ టార్గెట్ ఎవరు రెడ్డిగారు
Advertisement
Ads by CJ

గోపీచంద్ మలినేని క్రాక్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో బాలయ్య తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. క్రాక్ సినిమాలో రవితేజని నిజంగానే క్రాక్ కేరెక్టర్ లో చూపించడం, రొటీన్ విలనిజం కాకుండా డిఫరెంట్ గా డిజైన్ చెయ్యడం, హీరోయిన్ శృతి హాసన్ తో గ్లామర్ పక్కనపెట్టించి యాక్షన్ సీక్వెన్స్ తో హైలెట్ చెయ్యడం అన్ని సినిమాకి ప్లస్ అయ్యాయి. గోపీచంద్ మేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. అందుకే బాలయ్య ఇమ్మిడియట్ గా గోపీచంద్ కి వీరసింహారెడ్డి అవకాశం ఇచ్చాడు. గోపీచంద్ కూడా బాలయ్యని వీరసింహారెడ్డి లుక్ తోనే అభిమానులని ఇంప్రెస్స్ చేసాడు.

అయితే సినిమాలో బాలయ్య కటౌట్ కి యాక్షన్ మాత్రమే సెట్ అవుతుంది అన్న రేంజ్ లో కథని పక్కనబెట్టి ఫైట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అక్కడే గోపీచంద్ తప్పటడుగు వేసాడు. మాస్ ఆడియన్స్ మెచ్చే ఫైట్స్ ముఖ్యమే కానీ, ఫైట్స్ ని హైలెట్ చేసి కథని పక్కబెడితే ఆడియన్స్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తారని వీరసింహారెడ్డి రిజల్ట్ చూపించింది. మరి వీరసింహారెడ్డి టాక్ చూసాక ఏ హీరో గోపీచంద్ కి పిలిచి అవకాశం ఇస్తాడో చూడాలి. గోపీచంద్ మలినేని కన్ను మాత్రం స్టార్ హీరోలపైనే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలెవరూ ఖాళీ లేరు.

మరి గోపీచంద్ కి తన నెక్స్ట్ కథకి హీరోగా ఎవరు సెట్ వవుతారో చూడాలి. ఒకవేళ స్టార్ హీరోలు ఖాళీ లేకపోయినా.. యంగ్ హీరోలతోనైనా గోపీచంద్ ఇమ్మిడియట్ గా సినిమాకి కమిట్ అవ్వకపోతే.. హిట్ కొట్టి ఖాళీగా ఉన్న దర్శకుల లిస్టులోకి వెళ్లిపోవాల్సిందే. జర చూసుకో గోపి..!

Gopichand Malineni Next Hero?:

 Excited for Gopichand Malineni next hero

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ