Advertisementt

ఇంట్రెస్టింగ్: బుట్టబొమ్మతో నాగ్

Wed 01st Feb 2023 11:50 AM
pooja hegde,maaza ad,nagarjuna  ఇంట్రెస్టింగ్: బుట్టబొమ్మతో నాగ్
Nagarjuna-Pooja Hegde in Maaza ad ఇంట్రెస్టింగ్: బుట్టబొమ్మతో నాగ్
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే టాలీవుడ్ బుట్ట బొమ్మ. గత ఏడాది ఆమెకి కలిసిరాకపోయినా ఆమె బ్రాండ్ వాల్యూ, ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హిందీ, తెలుగు ప్రాజెక్టులతో పూజా హెగ్డే బిజీగానే ఉంది. తాజాగా సోదరుడి పెళ్ళిలో సారీ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన బుట్ట బొమ్మ ఇప్పుడు కింగ్ నాగార్జున తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అది సినిమానో లేదంటే మరేదన్నానో కాదు, పూజ హెగ్డే నాగార్జున తో కలిసి మాజా యాడ్ లో మెరిసింది. గతంలో అమితాబ్ చేసిన పూజ హెగ్డే అదే యాడ్ ని ఇప్పుడు నాగార్జునతో కలిసి చేసింది. నాగార్జున-పూజ హెగ్డే ల మాజా యాడ్ వీడియోని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

నాగార్జున మాజా తాగుతూ నడుస్తూ ఉండగా.. పూజ హెగ్డే సెక్రెటరీ గారు మన అసోసియేషన్ వెంచర్స్ వేసేసారా అని అడగ్గానే.. వేసేసారుగా అన్న నాగార్జున.. మామిడి పండు అంటే మాజానే కదా అద్భుతం అన్నారు. అదేమిటి పేరుకి బదులు మామిడి పండు అని రాసారు అని పూజ అనగానే.. మామిడిపండు అంటే మంచి తనం, పేరు చెప్పకుండానే సాధ్యం అంటూ మాజాని ప్రమోట్ చేస్తున్న యాడ్ తో నాగార్జున-పూజ హెగ్డే ఆకట్టుకున్నారు. సమ్మర్ వచ్చేస్తుంది. సో మాజా యాడ్ ని కొత్తగా ఇలా చేసి చూపించారన్నమాట.

Nagarjuna-Pooja Hegde in Maaza ad:

Pooja Hegde in Maaza ad with Nagarjuna

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ