KTR-చరణ్ తో బాలయ్య

బాలకృష్ణ టాక్ షో తెగ ఫెమస్ అయ్యింది. టాక్ షోలకే బాప్ లా అన్ స్టాపబుల్ టాక్ షో విపరీతంగా పాపులర్ అయ్యింది. ఆహా అందిస్తున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. పాన్ ఇండియాలో కూడా క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా ప్రభాస్ బాబుబలి ఎపిసోడ్ తో ఈ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పై చేసిన హంగామాతో అందరూ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ స్టయిల్, ఆయన సెలబ్రిటీస్ తో ఉండే తీరు, అలాగే అరవింద్ కి సాధ్యం లేనిది ఏది లేదు అని నిరూపించడం, వచ్చే గెస్ట్ లు బాలయ్య తో మింగిల్ అవుతున్న విధానం అన్నీ సూపర్బ్ అనేలా ఉన్నాయి.
తాజాగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి తెలంగాణ మినిస్టర్ KTR అలాగే స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి హాజరవుతున్నారనే న్యూస్ వినిపిస్తుంది. రామ్ చరణ్-KTR మంచి ఫ్రెండ్స్. అందుకే వీరి కలయికని అభిమానులకి కానుకగా ఇవ్వాలని అరవింద్ ఆలోచనట. రామ్ చరణ్ తో ఈ మధ్యన అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ చేసిన కాల్ తో బాలయ్య కనెక్ట్ అయ్యి సరదాగా మీ నాన్నగారి సినిమాకన్నా ముందు నాది చూడు అంటూ ఆర్డర్ వేశారు. ఇప్పుడు అదే స్టేజ్ పైకి రామ్ చరణ్ రావడం మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తుంది.
అటు యూత్ లోను, పార్టీలోని విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న KTR అన్ స్టాపబుల్ షోకి రావడంతో ఆ షోలో.. చంద్రబాబు మీద ఎదురు తిరిగి KCR తెరాస పార్టీ పెట్టడం, అలాగే KTR పర్సనల్ విషయాలను బాలయ్య ఎలా కెలుకుతారా అనే క్యూరియాసిటిలో తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. మరి KTR-రామ్ చరణ్ ఫాన్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోని దడదడలాడిస్తారేమో చూడాలి.
Ram Charan & KTR Together For Unstoppable 2 With NBK?
Balayya with KTR-Charan







































