ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mythri Movie Makers set it up like that

మైత్రి వారు అలా సెట్ చేసారు

ఈ సంక్రాంతికి బాలకృష్ణకి చిరంజీవికి ఎంత టెన్షన్ ఉందో తెలియదు కానీ.. మైత్రి మూవీస్ వారు మాత్రం ఈ రెండు సినిమాలని ఒకేసారి రిలీజ్ చెయ్యడంతో విపరీతమైన టెన్షన్ పడుతున్నారు. అటు బాలయ్య-ఇటు చిరు ఇద్దరూ సంక్రాంతికి కచ్చిఫ్ వెయ్యడంతో ఈ రెండు సినిమాలకు ఒకే నిర్మాత కావడంతో అందరిలో ఆసక్తి ఎక్కువైంది. బాలయ్య, చిరు మధ్యలో ఈ సంక్రాంతి ఫైట్ మాములుగా ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో వీరసింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్యలు విడుదలవుతున్నాయి.

దానితో ఏ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుంది.. ఏది బ్లాక్ బస్టర్ అవుతుందో తెలియక సతమతమవుతుంటే.. మరోపక్క బాలయ్య-మెగా ఫాన్స్ కి భయపడాల్సి వస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి టాక్ తేడా వచ్చినా ఆ ఇద్దరి హీరోల ఫాన్స్ రెచ్చిపోతారు. మా సినిమాకి తక్కువ ప్రమోషన్స్ చేసారు అంటే మా సినిమాకి తక్కువ ప్రమోషన్స్ చేసారంటూ నిర్మాతలపై పడతారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో వీరసింహ రెడ్డి-వాల్తేర్ వీరయ్యలను సమానంగా ప్రమోట్ చేస్తున్నారు మైత్రి వారు.

సాంగ్స్ విషయమైనా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విషయమైనా, ట్రైలర్ రిలీజ్ విషయమైనా ఏదైనా ఓ పద్ధతిలో వెళుతున్నారు. 6 న వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో పెడితే.. 8 న వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో సెట్ చేసారు. ఇలా ప్రమోషన్స్ ని సెట్ చేసుకుంటున్నారు మైత్రి వారు. తేడా జరిగితే ఏమవుంతుందో వాళ్ళకి తెలుసు కదా.

Waltair Veerayya vs Veera Simha Reddy

Mythri Movie Makers set it up like that
waltair veerayya
veera simha reddy