RC15: రామ్ చరణ్ స్పెషల్ అప్ డేట్

టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ RC15 షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. హీరోయిన్ కియారా అద్వానీ-రామ్ చరణ్ పై సాంగ్ చిత్రీకరణ కోసం RC15 టీమ్ రీసెంట్ గా న్యూజిలాండ్ వెళ్ళింది, అక్కడ రామ్ చరణ్ లుక్, అలాగే కొరియోగ్రాఫర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ టీమ్ హడావిడి చేసింది. చరణ్-కియారా అద్వానీలు అక్కడ బర్గర్స్ లాగిస్తూ, ఫోటో షూట్స్ చేయించుకుంటూ హంగామా చేసారు.

అయితే న్యూజిలాండ్ లో సాంగ్ షెడ్యూల్ ముగిసినట్టుగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చాడు. And it’s a wrap in New Zealand 🇳🇿 song & it’s visuals are fabulous 🎶 @shankarshanmugh garu, @BoscoMartis & @DOP_Tirru made it even more special. @advani_kiara stunning as always👌 @MusicThaman u nailed it again👍 @ManishMalhotra @AalimHakim thank you fr amazing looks. @SVC_official అంటూ చరణ్ సోషల్ మీడియాలో న్యూజిలాండ్ షెడ్యూల్ ముగించేసినట్లుగా స్పెషల్ అప్ డేట్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో SJ సూర్య రామ్ చరణ్ తో తలపడబోయే విలన్ గా కనిపించనున్నాడు. అలాగే జయరామ్, శ్రీకాంత్, అంజలి కీలకపాత్రల్లో కనిపిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

RC15 New Zealand schedule wrapped

Ram Charan update on RC15
rc15
new zealand
ram charan