షాలిని పాండే మరో అరాచకం
Shalini Pandey in a bold roleజబల్పూర్ జవరాలు షాలిని పాండే తెలుగు లో అర్జున్ రెడ్డి తో అరంగేట్రం చేసి తొలి చిత్రం తోనే సంచలనం సృష్టించింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో పోటీ పడుతూ ముద్దుల హద్దులు చెరిపేస్తూ మైమరపించింది. కానీ అర్జున్ రెడ్డి తర్వాత, విజయ్ దేవరకొండ అందనంత ఎత్తుకు వెళ్ళిపోతే, షాలిని పాండే కొన్ని అవకాశాలతోనే సర్దుకుపోతోంది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే, మహానటి చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. అలానే ఎన్టీర్ కథానాయకుడు చిత్రంలో షావుకారు జానకి పాత్ర పోషించింది. కళ్యాణ్ రామ్ 118, అనుష్క నిశ్శబ్దం చిత్రాలలో నటించినా ఆమె తారాపధంలో దూసుకుపోలేదు.
ఇప్పుడు షాలిని పాండే మరో అరాచకం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆమె బాలీవుడ్ లో ఒక చిత్రంల, బ్రోకర్ క్రింద నటించబోతోంది. బ్రోకర్ పాత్రలో షాలిని పాండే తన వద్దకు వచ్చే మగవారిని సంతోషపరచడానికి ఎంతకైనా తెగిస్తుంది అని తెలుస్తోంది. షాలిని పాండే అభిమానులు ఈ వార్త వినగానే, షాలిని అందాలను ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని ఉవ్విళూరుతున్నారు.
ప్రస్తుతం షాలిని పాండే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ చిత్రం మహారాజాలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చారిత్రక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా రూపొందించబడింది, దీనిలో మహారాజ్ భాగమైన వల్లభాచార్య సంప్రదాయం అనే హిందూ శాఖ విలువలను ప్రశ్నిస్తూ కథనాన్ని వ్రాసినందుకు జర్నలిస్టు మరియు సంస్కర్త కర్సందాస్ ముల్జీపై మహారాజ్ కేసు పెట్టారు.
Shalini Pandey to readying for another sensation







































