ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NBK107 Title Launch At Konda Reddy Buruju

NBK107 టైటిల్ ప్రకటన ఆ కోట నుంచే..

NBK107 Title Launch At Konda Reddy BurujuNBK107 Title Launch At Konda Reddy Buruju

నటసింహ బాలకృష్ణ అఖండ గా అఖండ విజయం సాధించిన తర్వాత వెనుతిరిగి చూడదలుచుకోలేదు. తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శరవేగంగా ప్రారంభించాడు. చిత్ర దర్శక నిర్మాతలు ఆ చిత్ర టైటిల్ ను అట్టహాసంగా దీపావళి రోజున ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసిందే. ఈ రోజు చిత్ర నిర్మాతలు, చిత్ర టైటిల్ ప్రకటన ఏ స్థలం నుండి చేస్తారో ప్రకటించారు. కర్నూల్ లో సుప్రసిద్ధమైన కొండా రెడ్డి బురుజు పై నుండి, అక్టోబర్ 21న సాయంత్రం 8. 15 నిమిషాలకు ఈ చిత్రం పేరును ప్రకటిస్తారు.

 

ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మరి చిత్ర దర్సక నిర్మాతలు వాటిలోంచి ఒక పేరును ప్రకటిస్తారా లేక సరికొత్త పేరును ప్రకటిస్తారా అన్నది వేచిచూడాలి. బాలకృష్ణ ఏ పేరుని ఎన్నుకున్నాడో కూడా ఆసక్తికరంగా మారనున్నది. ఈ చిత్రంలో, శృతి హాసన్ కథానాయికగా నటించనుండగా, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, మరియు చంద్రిక రవి ముఖ్య భూమికలు పోషించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ , హైదరాబాద్ లో జరుగుతున్నది.

 

చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కాకుండా, బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం చిత్రీకరణ వచ్ఛే నెల లో ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.

NBK107 Title Launch At Iconic Place

balakrishna
nbk107
title launch
iconic place
konda reddy buruju