ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> He is the Allu Aravind Dream Movie Charan Arjun Director

‘చరణ్-అర్జున్’ డైరెక్టర్ ఎవరంటే..

అల్లు అరవింద్ అలీతో సరదాగా టాక్ షో లో రామ్ చరణ్-అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడమే నా కల అని.. ఆయన చేసిన కామెంట్స్ మంగళవారం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్-అర్జున్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పదేళ్లుగా దానిని రెన్యువల్ చేయిస్తున్నాను.. కథ, అలాగే దానికి తగ్గ దర్శకుడు తగలగానే ఆ సినిమా పట్టాలెక్కుతోంది అని చెప్పి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తుంది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘కరణ్-అర్జున్’ మూవీకి చరణ్-అర్జున్ రీమేక్ అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకి దర్శకుడు ఎవరో, అరవింద్ మనసులో ఏ దర్శకుడు ఉన్నాడో అనేది కూడా తెలిసిపోయింది.

 

ఆయనెవరో కాదు అల్లు అర్జున్‌కి మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రామ్ చరణ్-అల్లు అర్జున్ కలయికలో రాబోయే చరణ్-అర్జున్ మూవీకి డైరెక్టర్ అని తెలుస్తుంది. అల్లు అర్జున్‌తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చేసిన త్రివిక్రమ్‌కి రామ్ చరణ్‌తో మాత్రం ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. మరి చరణ్-అర్జున్‌తో త్రివిక్రమ్ చెయ్యబోయే మూవీ ఎలా ఉంటుందో అనేది ఇప్పటినుండే ఆడియన్స్‌లో ఆత్రుత మొదలైపోయింది. 

Trivikram Srinivas will Directs Ram Charan and Allu Arjun combo film

He is the Allu Aravind Dream Movie Charan Arjun Director
trivikram srinivas
director
ram charan
allu arjun
combo film