బిగ్ బాస్ 6: నామినేషన్స్ లో కొట్టుకునేవారే

Bigg Boss 6: Nominations heatBigg Boss 6: Nominations heat

బిగ్ బాస్ సీజన్ 6 ఆరోవారం నామినేషన్స్ హీట్ హౌస్ ని కుదిపేసింది. గత వారం తమకి ప్లాప్ అని టాగ్ ఇచ్చిన వాళ్ళని, తమకి సామెతల బోర్డు వేసినవాళ్ళని నామినేట్ చేస్తూ రచ్చ చేసారు. కెప్టెన్ రేవంత్ సుదీప, బాలాదిత్యని నామినేట్ చేసి తనకి సామెతల బోర్డు ఎందుకు వేసారో అంటూ వాదించాడు. ఇక చంటి నామినేట్ అయ్యి ఎలిమినేట్ అవ్వడానికి కారణం కీర్తి నే అంటూ చాలామంది ఆమెని నామినేట్ చేసారు. ముఖ్యంగా సుదీప, ఇనాయ వాళ్ళు కీర్తి తో బాగా గొడవ పెట్టుకున్నారు. ఆదిరెడ్డి కూడా చంటి విషయంలో కీర్తి తో గొడవ పడ్డాడు. ఇక రాజ్ కి గీతూ కి మధ్యన నువ్వు వీక్ అంటే నువ్వు వీక్ అని, నువ్ బిగ్ బాస్ రూల్స్ పాటించడం లేదంటే నువ్వు రూల్స్ పాటించడం లేదు అంటూ వాదనకు దిగారు.

ఆదిరెడ్డి-రోహిత్ అయితే ఒకొనొక టైం లో కొట్టేసుకుంటారేమో అనుకున్నారు. అంతలా రెచ్చిపోయి గొడవపడ్డారు. మరీనా మంచితనంతో ఫైమా బాగా ఆడినప్పటికీ మరీనా కే హౌస్ మేట్స్ సపోర్ట్ చేసారంటూ ఆదిరెడ్డి ఆమెని నామినేట్ చేసాడు. దానితో రోహిత్ రెచ్చిపోయాడు. ఇక ఫైమా అయితే సుదీప తనకి ప్లాప్ ఇచ్చిన కారణంగా నామినేట్ చేసి గొడవ చేసింది. ఇనాయ - కీర్తి అయితే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవపడ్డారు. సూర్య గీతుని నామినేట్ చేసాడు. ఈ వారం కీర్తి-ఆది రెడ్డిలకు హైయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి. ఇంకా గీతు, బాలాదిత్య, సుదీప, శ్రీసత్య, రాజ్, శ్రీహన్, మరీనాలు నామినేషన్స్ లోకి వచ్చారు.  

Bigg Boss 6: This week Nominations list

bigg boss 6
inaya
revanth