దసరా నవరాత్రుల్లో ఎన్టీఆర్ 30 అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ విజయదశమి వచ్చేసింది. ఎన్టీఆర్ 30 అప్ డేట్ ఇంకా రాలేదు. కానీ ఫాన్స్ మాత్రం రేపు బుధవారం విజయదశమి రోజున ఎన్టీఆర్ 30 అప్ డేట్ ఎలాగైనా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో NTR30 ని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల-ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కబోయే NTR30 అప్ డేట్ ఖచ్చితంగా రేపు దిగుతుంది అంటూ హంగామా మొదలు పెట్టారు.
మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఫాన్స్ ఆగడం లేదు. NTR30 వస్తుందమ్మా, Waiting for #NTR30 Title Card! #NTR30 తో మళ్లీ మేమే కొడతాము, #NTR30 Update on the way ఇలా వాళ్ళు NTR30 ని ట్రెండ్ చేస్తున్నారు. మరి కథ ప్రాబ్లమో, లేదంటే హీరోయిన్ ప్రాబ్లమో తెలియదు కానీ.. ఆ సినిమా ఇదిగో అదిగో మొదలవుతుంది అనడమే కానీ.. ఇంతవరకు మొదలైంది లేదు. దానితో ఫాన్స్ డిస్పాయింట్ అయినప్పటికీ.. ఈ దసరా రోజున అప్ డేట్ ఖచ్చితంగా వస్తుంది అంటూ నమ్ముతున్నారు వాళ్ళు. మరి ఎన్టీఆర్ ఫాన్స్ కోరిక తీరాలని కోరుకుందాం.