Advertisement

స్వాతిముత్యం ఓటిటి పార్ట్నర్ రివీల్డ్

Tue 04th Oct 2022 09:00 PM
swathi muthyam,bellamkonda ganesh,swathi muthyam ott partner  స్వాతిముత్యం ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Swathi Muthyam OTT Partner Revealed స్వాతిముత్యం ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Advertisement

బెల్లంకొండ గణేష్ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇస్తున్న మూవీ స్వాతి ముత్యం. రేపు బుధవారం దసరా స్పెషల్ గా విడుదలవుతున్న ఈ చిత్రం పై అంతో ఇంతో క్రేజ్ ఉంది. చిరంజీవి-నాగార్జున మధ్యలో నేను అన్నట్టుగా గణేష్ దూరండంతో ఆయన సినిమాకి క్రేజ్ వచ్చేసింది. గాడ్ ఫాదర్-ద ఘోస్ట్ మధ్యలో స్వాతి ముత్యం. ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం స్వాతిముత్యం ప్రీమియర్స్ మహేష్ AMB సినిమాస్ లో ప్రదర్శించారు. ఇక కొద్దిసేపటి క్రితమే మొదలైన స్వాతిముత్యం నిడివి 124 నిముషాలు కాగా.. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ కొరడా బాల మురళి కృష్ణ గా కనిపిస్తుండగా.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ భాగ్యలక్ష్మిలా కనిపించబోతుంది. 

ఈమూవీ ఓటిటి రైట్స్ ని ఆహా దక్కించుకుంది. మంచి డీల్ తోనే స్వాతిముత్యం డిజిటల్ హక్కులని ఆహా దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. టైటిల్ కార్డ్స్ లోనే స్వాతి ముత్యం ఓటిటి పార్టనర్ ఆహా అంటూ రివీల్ చేసేసారు. గణేష్ బెల్లంకొండ కి స్వాతి ముత్యం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.. చూడాలి.

Swathi Muthyam OTT Partner Revealed:

Swathi Muthyam OTT Partner details out

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement