Advertisement

దసరాకే స్టార్ట్ అంటున్న ప్రశాంత్-ప్రభాస్

Thu 22nd Sep 2022 01:42 PM
salaar movie,prabhas,salaar update  దసరాకే స్టార్ట్ అంటున్న ప్రశాంత్-ప్రభాస్
Salaar Update దసరాకే స్టార్ట్ అంటున్న ప్రశాంత్-ప్రభాస్
Advertisement

ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్స్ అన్ని పక్కనబెట్టి పెదనాన్న కృష్ణం రాజు గారి దశదిన కర్మల విషయంలో బిజిగా వున్నారు. నిన్న కృష్ణం రాజుగారి 11 వ రోజు కార్యక్రమం పూర్తయ్యింది. కానీ ఈనెల 29 న పాలకొల్లు మొగళ్తూరులో కృష్ణం రాజు గారి సంస్కరణ సభకి ప్రభాస్ హాజరవ్వాల్సి ఉంది. వేలాదిమంది అభిమానుల మధ్యన ఈ సభ భారీ ఎత్తున జరగనుంది. ఇక అది పూర్తయ్యాక దసరా తర్వాత ప్రభాస్ తన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారని అన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సలార్ షూటింగ్ లో  ఈనెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుండి పాల్గొంటారని తెలుస్తుంది.

వచ్చే వారమే ప్రభాస్ సలార్ సెట్స్ లోకి వెళతారని, 29 న మొగళ్తూరు లో సభ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ సలార్ సెట్స్ లోకి వెళ్ళిపోతారని, అది దసరా నవరాత్రులైనా సరే ప్రభాస్ షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కూడా తదుపరి షెడ్యూల్ ఏర్పాట్లలో మునిగిపోయారని అంటున్నారు. ఈ లోపు శృతి హాసన్ కూడా బాలయ్య NBK107 షూటింగ్ స్పాట్ టర్కీ నుండి హైదరాబాద్ కి వస్తుంది అని, ప్రభాస్-శృతి హాసన్ పై నెక్స్ట్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతుంది అని తెలుస్తుంది.

Salaar Update:

Prabhas Salaar Update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement