Advertisementt

నేను చావకుండా అమ్మ కాపాడింది: దీపికా

Sat 06th Aug 2022 10:33 AM
deepika padukone,depression,project k,south movies  నేను చావకుండా అమ్మ కాపాడింది: దీపికా
Deepika Padukone says mom realize how she cried నేను చావకుండా అమ్మ కాపాడింది: దీపికా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన దీపికా పడుకొనే ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో సౌత్ కి ఎంట్రీ ఇస్తుంది. ప్రెజెంట్ టాప్ లెవల్ క్రేజ్ ఉన్న దీపికా పదుకొనె ఒకప్పుడు డిప్రెషన్ కారణంగా సూయిసైడ్ చేసుకోవాలని అనుకున్న విషయాన్ని ఆమె చాలాసార్లు, చాలా సందర్భాల్లో చెప్పింది. తాజాగా ఆమె ఓ ఈవెంట్ లో మరోసారి తన డిప్రెషన్ విషయాన్ని ప్రస్తావించింది. హీరోయిన్ గా నా కెరీర్ ఎంతో బాగుంది. చేతినిండా సంపాదన. అయినా తెలియని నిరాశ, బాధ నాలో ఉండేది. నాలోని బాధకి కారణం తెలిసేది కాదు. అప్పుడప్పుడు సూయిసైడ్ థాట్స్ కూడా వచ్చేవి. ఏడుపొచ్చేది. దానితో నిద్రపోతే ఈ బాధ తగ్గొచ్చు అనుకుని.. ఎక్కువగా నిద్రపోయేదాన్ని. 

మా పేరెంట్స్ బెంగుళూర్ లో ఉండేవారు. నేను ముంబైలో ఉండేదాన్ని. అప్పుడప్పుడూ మా పేరెంట్స్ నన్ను చూడడానికి ముంబై వస్తుండేవారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా హుషారుగా ఉండేదాన్ని. కానీ ఓసారి మా మదర్ నేను డల్ గా ఉండడం కనిపెట్టేసారు. ఆవిడ ఏమిటి సమస్య.. కెరీర్ లో ప్రోబ్లెంస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే బాయ్ ఫ్రెండ్ సమస్యలా? అంటూ నన్ను ప్రశ్నించింది. కానీ అవేవీ నా బాధకు కారణాలు కాదు. నాలో తెలియని శూన్యత ఏర్పడిందని మా అమ్మ అర్థం చేసుకుని, నన్ను డిప్రెషన్‌ నుంచి బయట పడెయ్యడానికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగా నేను తిరిగి కోలుకున్నాను.. ఆ సమయంలో ఆ దేవుడే మా అమ్మను నా వద్దకు పంపాడా అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యింది. 

Deepika Padukone says mom realize how she cried:

Deepika Padukone Recalls Battling Depression

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ