ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మాస్ హిట్ కొట్టడమే కాదు, ఫామ్ లో లేని దర్శకుడు పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అటు నిర్మాతగా, ఇటు దర్శకుడిగా పూరి ఒక్కసారిగా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చేసాడు. తర్వాత రామ్ రెడ్ మూవీ చెయ్యగా.. పూరి జగన్నాధ్ ఏకంగా లైగర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టేసాడు. రామ్ ప్రస్తుతం ద వారియర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా రామ్ ఇంటర్వ్యూ జరిగింది.
ఆ ఇంటర్వ్యూలో ఓ మీడియా మిత్రుడు ద వారియర్ మూవీ ని లింగుసామి దర్శకత్వలో చేసారు కదా.. ఆయన ఒకప్పుడు హిట్ సినిమాలు చేసినా ప్రస్తుతం ఫామ్ లో లేని డైరెక్టర్ కదా అని ప్రశ్నించగా దానికి రామ్ అదిరిపోయే సమాధానం చెప్పాడు. అదేమిటంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ చేసినప్పుడు కూడా పూరి ఫామ్ లో లేరు. అలా అనుకుంటే ఇస్మార్ట్ శంకర్ వచ్చేది కాదు, లింగుసామి, పూరి ఇద్దరూ డైమండ్స్ లాంటి డైరెక్టర్స్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. మరి రామ్ నుండి ఇస్మార్ట్ లాంటి హిట్ వారియర్ తో వస్తుంది అని ఆశించవచ్చేమో.