Advertisementt

రామ్ లైనప్ లో కామెడీ డైరెక్టర్

Tue 12th Jul 2022 12:09 PM
ram,ram interview,the worrierr,boyapati,harish shankar,ram - anil ravipudi  రామ్ లైనప్ లో కామెడీ డైరెక్టర్
Ram to collaborate with Anil Ravipudi రామ్ లైనప్ లో కామెడీ డైరెక్టర్
Advertisement
Ads by CJ

హీరో రామ్ మరో మూడు రోజుల్లో ద వారియర్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కిన వారియర్ పై అంచనాలు ఉన్నాయి. లింగుసామి దర్శకుడిగా తెరకెక్కిన వారియర్ ప్రమోషన్స్ లో రామ్ ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నాడు. తాజాగా రామ్ తో మీడియా ఇంటరాక్ట్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో రామ్.. తన తదుపరి ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. వారియర్ తర్వాత రామ్, బోయపాటి తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. 

ఇక రీసెంట్ గా వారియర్ ఈవెంట్ లో రామ్ తో హరీష్ శంకర్ మూవీ చెయ్యబోతున్నట్టుగా హరీష్ శంకర్ కన్ ఫర్మ్ చేసాడు. రామ్ తో తాను ఓ మూవీ చెయ్యబోతున్నట్టుగా ఆయన ఆ ఈవెంట్ లో ప్రకటించారు. మాస్ డైరెక్టర్ తో మాస్ హీరో అంటూ ఫాన్స్ ఖుషి అయ్యారు. ఇక తాజాగా రామ్ హరీష్ శంకర్ తో పాటుగా అనిల్ రావిపూడి తో స్టోరీ సిట్టింగ్ జరుగుతున్నట్టుగా చెప్పాడు. బోయపాటి తర్వాత ఇంకా ఏ మూవీ చెయ్యాలో డిసైడ్ చేసుకోలేదు అని చెప్పాడు. F3 లాంటి హిట్ తర్వాత బాలయ్య ని డైరెక్ట చెయ్యబోతున్న అనిల్ రావిపూడి.. తర్వాత రామ్ తో మూవీ కన్ ఫర్మ్ అవ్వబోతున్నట్లుగా రామ్ మాటల్లో తెలుస్తుంది. అనిల్ - రామ్ కలయికలో కామెడీ మూవీని ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేయొచ్చేమో. ముందు బోయపాటి, తర్వాత హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఇలా రామ్ లైనప్ మాములుగా లేదుగా అంటూ రామ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Ram to collaborate with Anil Ravipudi:

Hero Ram interview

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ