జవాన్ షూటింగ్ లో నయనతార

నయనతార విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి తర్వాత ఆమె నటనకు ఫుల్ స్టాప్ పెట్టాలనే కండిషన్ మీదే వాళ్ళ పెళ్లికి విగ్నేష్ శివన్ తల్లి ఒప్పుకున్నట్లుగా నయనతార పెళ్లి ముందు ప్రచారం జరిగింది. అందులో నిజమెంతుందో ఎవరికీ తెలియదు. కానీ నయనతార ఒప్పుకున్న సినిమాల విషయంలో ఫాన్స్ మధ్యన తర్జనభర్జన జరిగింది. అయితే అలాంటి కండిషన్ ఏమి నయనతారకి విగ్నేష్ శివన్ తల్లి పెట్టలేదు అని.. నయనతార పెళ్లి - హనీమూన్ తర్వాత యధావిధిగా షూటింగ్స్ కి హాజరవడంతో తేలిపోయింది.
నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి అవగానే కేరళ వెళ్లి నయనతార తల్లితో గడిపిన తర్వాత బ్యాంకాక్ కి హనీమూన్ కి వెళ్లిపోయారు. అక్కడ హనీమూన్ లో కొద్ది రోజులు ఎంజాయ్ చేసిన ఈ జంట రెండు రోజుల క్రితమే చెన్నై కి చేరుకుంది. ఆ తర్వాత నయనతార రొటీన్ లైఫ్ లోకి అంటే తన షూటింగ్స్ కి హాజరైపోతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ గడప తొక్కని నయనతార ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తో హిందీ మూవీ జవాన్ లో నటిస్తుంది. హనీమూన్ ముగించుకుని చెన్నై వచ్చి అక్కడి నుండి ముంబై వెళ్ళిన నయనతార నిన్న సోమవారం నుండి ముంబైలో జరుగుతున్న జవాన్ షూటింగ్ లో పాల్గొంటుంది.
Nayanthara begins shooting for Jawan with Shah Rukh Khan in Mumbai after returning from her honeymoon
Nayanthara Joins Shah Rukh Khan for Jawan Shoot in Mumbai




































