ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hari Hara Veera Mallu Sri Ramanavami Special Poster on

వీరమల్లు గెటప్ లో పవన్ శ్రీరామ పూజలు

Hari Hara Veera Mallu Sri Ramanavami Special Poster on

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఓ నెల గ్యాప్ తీసుకుని హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో గత ఏడాది మొదలైన వీరమల్లు షూటింగ్ కోవిడ్ కారణంగా వాయిదా పడగా.. తర్వాత పలు కారణాలతో షూటింగ్ ఈనెల 8 న మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కత్తి సాము, యుద్ధ విద్యలు నేర్చుకున్న ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేసాయి. ఇక హరి హర వీరమల్లు లో పవన్ కళ్యాణ్ గెటప్ ఎలా ఉంటుందో ఆయన ఫస్ట్ లుక్స్, వీరమల్లు గ్లిమ్ప్స్ లోనే చూసేసాం. 

తాజాగా ఆయన వీరమల్లు గెటప్ లో శ్రీ రామనవమి సందర్భంగా ఈ రోజు హరి హర వీరమల్లు సెట్స్ లో పూజలు నిర్వహించిన పిక్స్ ని షేర్ చేసింది టీం. అందులో పవన్ కళ్యాణ్ శ్రీరామునికి పూజ చేస్తూ ఉన్న ఫొటోస్ ఉండగా.. ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకి హరి హర వీరమల్లు నుండి శ్రీరామ నవమి స్పెషల్ గా కొత్త పోస్టర్ వదలబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ రామ్ పాల్ విలన్ గాను, నోరా ఫెతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Hari Hara Veera Mallu Sri Ramanavami Special Poster on today 11.30 am

hari hara veera mallu
sri ramanavami special
pawan kalyan
krish
thota tarani
hari hara veera mallu sri ramanavami special poster