‘సలార్’లో ప్రభాస్ పాత్ర అదేనట!
Prabhas Role in Salaar Revealed‘రాధే శ్యామ్’లో ప్రభాస్ అస్త సాముద్రికా నిపుణునిగా కనిపించారు. ‘ప్రాజెక్ట్ కె’లో సూపర్ మ్యాన్‌గా కనిపిస్తారని ప్రచారం ఉంది. ఇక ‘ఆదిపురుష్’లో ప్రభాస్ మోడ్రన్ రాముడిగా కనిపించబోతున్నారట. ‘సలార్’లో ప్రభాస్ ఓ డాన్‌లా కనిపిస్తారని, ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారని ప్రచారం జరగడంతో పాటు, ప్రభాస్ ఊర మాస్ అవతారంలో ఉన్న లుక్స్ లీకవడంతో ఆయన పాత్రపై అందరిలో చాలా ఊహాగానాలు పెరిగాయి. పక్కా మాస్ అవతార్ అని అనిపిస్తున్నా.. క్యారెక్టర్ పై క్లారిటీ లేదు.
అయితే తాజాగా కెజిఎఫ్ 2 ప్రమోషన్స్‌లో ప్రశాంత్ నీల్ అక్కడక్కడా సలార్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా సలార్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారాయన. ప్రభాస్ సలార్‌లో చాలా వైలెంట్‌గా కనిపిస్తారని, అంటే భయంకరమైన పాత్రలో కనిపిస్తారని, పవర్ ఫుల్‌గా మాత్రమే కాకుండా ప్రభాస్ క్యారెక్టర్‌కి జాలీ, దయ, కరుణ లేకుండా విలన్స్‌ను ఊచకోత కొస్తాడంటూ.. క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. కెజిఎఫ్‌లో రాఖీ భాయ్‌గా యశ్‌ని ప్రెజెంట్ చేసిన విధానానికి స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. హీరోలంతా సర్‌ప్రైజ్ అయ్యారు. సో సలార్‌లో ప్రభాస్ మాస్‌గా డాన్ తరహాలోనే కనిస్తారు అనేది మాత్రం ప్రశాంత్ మాటలతో క్లారిటీ వచ్చేసింది.
Prashanth Neel Talks About Prabhas Role in Salaar







































