ఓ రేంజ్ లో అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్

Allu Arjun Birthday Celebrations

నేడు అల్లు అర్జున్ బర్త్ డే. పుష్ప తో పాన్ ఇండియా హిట్ తర్వాత వచ్చిన బర్త్ డే కావడంతో ఇది అల్లు వారికి చాలా అంటే చాలా స్పెషల్ బర్త్ డే అని చెప్పాలి. పుష్ప సినిమాతో హిందీ మార్కెట్ ని కొల్లగొట్టిన పుష్ప రాజ్ కి ఆ భాషా లేదు, ఈ భాషా లేదు సెలబ్రిటీస్ అంతా బర్త్ డే విషెస్ ని సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తన 40 వ పుట్టిన రోజు వేడుకలని అంగరంగ వైభంగానే చేసుకున్నారు. 

అల్లు అర్జున్ తన బర్త్ డే పార్టీ ని ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్స్ చూస్తే తెలుస్తుంది. అల్లు అర్జున్ 40th బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఫారిన్ అంటే సెర్బియా లో పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసారు. చేతిలో కాండిల్ పట్టుకుని కేక్ కట్ చేస్తూ ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్యన అల్లు అర్జున్ ఎంతో హ్యాపీ గా పార్టీని ఎంజాయ్ చేస్తున్న పిక్స్ మీ కోసం.. 

Allu Arjun 40th Birthday Celebrations

allu arjun
allu arjun birthday
allu arjun birthday celebrations
aneha reddy