చరణ్ సినిమాకి నో చెప్పిన స్టార్ హీరో
Top actor rejects Shankar and Ram Charan filmరామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూడ్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ పార్టీలని ముగించుకుని రామ్ చరణ్ శంకర్ తో చెయ్యబోయే RC 15 తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చరణ్ తో రెండోసారి రొమాన్స్ చేయబోతుంది కియారా అద్వానీ. ఇప్పటికే వీరిద్దరిపై ఓ సాంగ్ కూడా చిత్రీకరించారు శంకర్. ఈ సినిమాలో అంజలి కూడా నటిస్తుండడంతో చరణ్ కి రెండో హీరోయిన్ గానే ఆమె కనిపించబోతుంది అంటున్నారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నా యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు.
తాజాగా రామ్ చరణ్ మూవీ కి ఓ స్టార్ హీరో నో చెప్పారనే టాక్ నడుస్తుంది. అది మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ని దర్శకుడు శంకర్ ఓ కీలక పాత్ర కోసం సంప్రదించగా.. ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉండడంతో.. మోహన్ లాల్ ప్రస్తుతం ఇలాంటి నెగెటివ్ కేరెక్టర్స్ చెయ్యడం లేదు అంటూ శంకర్ ఆఫర్ ని తోసిపుచ్చినట్టుగా తెలుస్తుంది. తెలుగులో జనతా గ్యారేజ్, అలాగే మనమంతా సినిమాల్లో నటించిన మోహన్ లాల్ అటు తమిళంలో హీరో విజయ్ తో జిల్లా లో నటించారు. అలా మోహన్ లాల్ అయితే తెలుగు, తమిళ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారనుకుంటే.. ఆయన రామ్ చరణ్ మూవీకి నో చేబుతారనే విషయాన్ని శంకర్ ఊహించలేదట. మరో పక్క మోహన్ లాల్ పాత్రకి అరవింద్ స్వామిని RC15 యూనిట్ సంప్రదిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది.
Mohanlal Rejected A Role In Charan-Shankar Movie?







































