ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bheemla Nayak premieres a day before on OTT

ఒకరోజు ముందే భీమ్లా నాయక్ సర్ ప్రైజ్

ఫిబ్రవరి 25 న విడుదలై బాక్సాఫీసుని ఊచకోత కోసిన భీమ్లా నాయక్ సెన్సేషన్ ఇప్పుడు ఓటిటిలో అంటూ గత వారం రోజులుగా ప్రమోషన్స్ ని హీటెక్కిస్తున్నాయి సదరు ఓటిటి సంస్థలు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ రెండు పేరున్న ఓటిటీల నుండి మార్చ్ 25 న విడుదల కాబోతున్నాయంటూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి ఒకేసారి ఒకే టైం కి భీమ్లా నాయక్ ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మార్చి 25 నే భీమ్లా నాయక్ ఓటిటి రిలీజ్ అని అఫీషియల్ గా ప్రకటించారు. కాని అదే రోజు పాన్ ఇండియా మూవీగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుంది. 

అయితే ట్రిపుల్ ఆర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే భీమ్లా నాయక్ ఓటిటిలో అదే రోజు రావడాన్ని చాలామంది ఏకీభవించలేదు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ ఎంతో కొంత ట్రిపుల్ ఆర్ పై పడుతుంది అని అన్నారు. అందుకేనేమో సదరు ఓటిటి సంస్థలు భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చెయ్యకుండా ఒకరోజు ముందుకు జరిపాయి. అంటే మార్చ్ 24 నే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి ఆహా ఓటిటి నుండి భీమ్లా నాయక్ రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా భీమ్లా నాయక్ ని ప్రీ పోన్ చేసారు. సో మార్చ్ 25 న కాకుండా మార్చ్ 24 నే భీమ్లా నాయక్ ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి రిలీజ్ కాబోతుంది.

Bheemla Nayak streaming on March 24th

Bheemla Nayak premieres a day before on OTT
bheemla nayak
pawan kalyan
bheemla nayak premieres
ott
aha ott
disney plus hot star