బాలకృష్ణ కి సమరసింహా రెడ్డి, నరసింహ రెడ్డి సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాయో అందరికి తెలిసిందే. ఆ తర్వాత బాలకృష్ణ రెడ్డి టైటిల్ తో పెద్దగా సినిమాలు చెయ్యలేదు. ప్రస్తుతం అఖండ సక్సెస్ తో యమా స్పీడుగా తన నెక్స్ట్ మూవీ NBK107 ని గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ పార్ట్ తో మొదలు పెట్టేసారు. తెలంగాణలోని సిరిసిల్లలో NBK107 గ్రాండ్ గా మొదలైంది. రామ్ - లక్షణ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో బాలయ్య యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య మాస్ అవతార్ లో లుంగీ కట్టుకుని కుర్చీలో కూర్చున్న పిక్ అది. అది చూసిన మాస్ ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
అయితే ఇలాంటి లీకుల రాయుళ్ళకి గోపిచంద్ మలినేని హంబుల్ రిక్వెస్ట్ చేసారు. ఇలాంటివి లీకులని ఎంకరేజ్ చెయ్యవద్దు అని. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని, ఓ యంగ్ కేరెక్టర్ శృతి హాసన్ తో రొమాన్స్ చేస్తుండగా.. మరో కేరెక్టర్ పవర్ ఫుల్ గా ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్ పేరు వీరసింహారెడ్డి అని, టైటిల్ కూడా రెడ్డి సెంటిమెంట్ తో వీరసింహారెడ్డి టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుంది అని అంటుంటే.. బాలకృష్ణ NBK107 లీకెడ్ పిక్ చూసిన కొందరు ఈ సినిమా ఓ తమిళ సినిమాకి రీమేక్ అంటూ ప్రచారంలోకి దిగిపోయారు.