Advertisement

అనటం ఎందుకు, ఆ తరువాత ఇలా ఎందుకు

Thu 27th Jan 2022 09:18 PM
anchor anasuya,netizens,trolls,anasuya bharadwaj,upasana konidela,republic day  అనటం ఎందుకు, ఆ తరువాత ఇలా ఎందుకు
Netizens trolls on Anasuya and Upasana అనటం ఎందుకు, ఆ తరువాత ఇలా ఎందుకు
Advertisement

మన సెలబ్రిటీస్ కొందరు సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా వుంటారు. ఏదైనా పండగో, లేక దేశానికీ సంబంధించి ముఖ్యమయిన చారిత్రాత్మిక ఘట్టంలో వచ్చినప్పుడు తమ సోషల్ మీడియా ద్వారా చెప్పటం పరిపాటి కూడా. అయితే తెలియనప్పుడు సింపుల్ గా చెప్పి ఊరుకుంటే సరిపోయేది, కానీ ఏదో చేసేద్దాం అనుకుంటే మాత్రం దొరికిపోతారు. అలానే అయ్యింది ఆంచారు అనసూయ మరియు ఉపాసన కొణిదెల విషయంలో. అనసూయ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పి ఊరుకుంటే సరిపోయేది, వందే మాతరం పాట, దానికి తోడు గాంధీ గారి బొమ్మ వున్న టి షర్ట్ వేసుకుంది. ఇంకా ఊరుకుంటారా నెటిజెన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. మనం తప్పు వొప్పుకోము సరికదా సమర్ధించుకోడానికి ఇంకేదో అనేస్తారు. 

అది కూడా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేస్తే కోపం వస్తుంది, కోపం వస్తే ఊరుకోరు ఇంక అక్కడ నుండి టాపిక్ డైవర్ట్ అవుతుంది. అసలు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో సింపుల్ గా ఉంటే సరిపోయేది కదా. తెలియనప్పుడు ఎందుకు ఏదో పెట్టడం, ఆ తరువాత అన్నారు అని బాధపడటం. ఇదేమి అనసూయ కి కొత్త కాదు, ఎన్నో సార్లు ఇలా ట్రోల్ చేసారు ఆమెని, ఆమె సీరియస్ అయ్యింది, మళ్ళీ కొద్దీ రోజుల తరువాత షరా మామూలే. 

అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒక టెంపుల్ గోపురం మీద అందరి బొమ్మలు వేసి రిపబ్లిక్ డే రోజు పెట్టింది. అది కూడా కొంచెం ఎక్కువ చేసినట్టే కదా. ఊరుకుంటారా, ఒక కమ్యూనిటీ మనోభావాలు దెబ్బ తిన్నాయని ట్రోల్ చేసారు. ఎందుకు అలాంటివి పెట్టడం, ఆ తరువాత తల పట్టుకోవటం.  వీళ్ళకి తెలిసి పెడతారో, తెలియక పెడతారో, లేక పబ్లిసిటీ కోసం చేస్తారో, ఏమో అంతా ఆ పైవాడికే ఎరుక.

Netizens trolls on Anasuya and Upasana:

Netizens Trolls On Anasuya

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement