దుల్కర్ సల్మాన్‌కి దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహానటి, కనులు కనులుని దోచాయంటే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. హే సినామిక అనే తెలుగు-తమిళ ద్విభాషా ఎంటర్‌టైనర్‌తో మరోసారి ప్రేక్షకులని, సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ మరియు అదితి రావ్ హైదరీ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 25 న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా హే సినామిక సినిమాలోని ప్రాణం అనే పాటను రిలీజ్ చేసారు.
తెలుగు వెర్షన్ సాంగ్ ని మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ రిలీజ్ చేసారు. మరి తన డార్లింగ్ కాజల్ అగర్వాల్ నటించిన హే సినామికా సినిమా లోని ప్రాణం సాంగ్ ని ప్రభాస్ లాంచ్ చేసారు. కాజల్ అగర్వాల్ ప్రభాస్ తో రెండు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు దుల్కర్ తో నటించిన సినిమా సాంగ్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఇక తమిళంలో ఈ సాంగ్ ని విజయ్ సేతుపతి, రష్మిక మందన్నలు రిలీజ్ చేసారు.