RC15 పై షాకింగ్ న్యూస్

దిల్ రాజు - రామ్ చరణ్ - కోలీవుడ్ టాప్ దర్శకుడు శంకర్ కాంబోలో గత ఏడాది అక్టోబర్ లోమొదలైన RC15 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో తెరకెక్కుతున్న RC15 మూవీ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే భారీ ఆలోచనల డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలోని ప్రతి ఎపిసోడ్ కి కోట్లు ఖర్చుపెట్టిస్తున్నారట. ఓ యాక్షన్ ఎపిసోడ్ కే 70 కోట్లు ఖర్చు పెట్టిస్తున్న శంకర్.. ఓ సాంగ్ కోసం ఏకంగా 25 కోట్ల బడ్జెట్ వేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ కలయికలో తెరకెక్కనున్న ఈ సాంగ్ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలవనుంది.

అందుకే శంకర్ ఈ సాంగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెడుతున్నారట. మరి శంకర్ మూవీస్ లోని సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. ఆయన సినిమాల చూసిన వారికి తెలుస్తుంది. సినిమాలో సాంగ్స్ మెయిన్ హైలెట్ అయ్యేలా ఆయన చిత్రీకరణ ఉంటుంది. ఇక దిల్ రాజు కూడా బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా కి ఎంత ఖర్చు పెట్టినా వెనక్కి వచ్చేస్తాయని భరోసా ఉంది. కాబట్టే దిల్ రాజు కూడా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే జీ సంస్థ నుండి RC15 కి అదిరిపోయే డీల్ వచ్చినట్లుగా టాక్ ఉండనే ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడని, కియారా అద్వానీ రామ్ చరణ్ కి పీఏ గా కనిపించబోతుంది అని, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రల్లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.  

Ram charan RC!5 update

Shocking update on RC!5
rc!5
ram charan
director shankar
dil raju
kiara advani
anjali
srikanth