బిగ్ బాస్ 5: గొడవలకు నేనే కారణం

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లాస్ట్ వీక్ లోకి అడుగుపెట్టేసింది. వచ్చే ఆదివారమే.. సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే.. ఫినాలే వీక్ లో టాప్ లో శ్రీరామ చంద్ర, సన్నీ, సిరి, షణ్ముఖ్, మానస్ లు ఉన్నారు. ఇక నిన్న ఆదివారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యి చివరి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ ని వీడింది. స్టేజ్ పైకి వెళ్లేముందు సన్నీ, మానస్ లను పట్టుకుని ఏడ్చేసిన కాజల్.. స్టేజ్ పైకి ఎక్కి తన బిగ్ బాస్ జర్నీ చూసుకుని బాగా ఎమోషనల్ అయ్యింది. తన జర్ని చూసుకుని.. హౌస్ మేట్స్ ని చూడగానే సర్ నేను అక్కడ ఉండాల్సింది అంటూ నాగార్జున తో అంది.. ఏముంది వాళ్ళు కూడా ఇంకో వారంలో బయటికి వచ్చేస్తారులే అన్నాడు నాగార్జున.

ఇక కాజల్ సన్నీ, మానస్ లతో మాట్లాడింది.. శ్రీరామ చంద్ర నీ కోపం పోయిందా అని అడిగింది.. ఇక నాగార్జున షణ్ముఖ్ నాదొక ప్రశ్న చెప్పు అనగానే షణ్ముఖ్ కంగారు పడ్డాడు.. సిరి తో హగ్స్ విషయంలో తనకి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది అని జెస్సి వీడియో బైట్ తో మనోడికి బాగా అర్ధమైంది. అయితే నాగార్జున మాత్రం కాజల్ వెళ్ళిపోతుంది.. హౌస్ లో గొడవలు తగ్గుతాయా అని అడగగానే.. సర్ కాజల్ గొడవలు పెట్టింది అని కాదు.. ఆమె ఉంటే గొడవలు అవుతాయన్నా.. కానీ బిగ్ బాస్ హౌస్ మొత్తం బోసి పోతుంది కాజల్ లేకపోతె అన్నాడు. ఇక కాజల్ కూడా అవును నేను బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పెట్టాను, కావాలని పెట్టలేదు, గొడవ జరిగే చోట నేను ఉండేదాన్ని అని చాలా ఫ్రాంక్ గా ఒప్పేసుకుంది.

మరి కాజల్ లో టాస్క్ కెపాసిటీ లేకపోయినా. అలా గొడవలు, స్ట్రాటజిల కంటెంట్ తోనే మూడు, నాలుగు వారాల్లో వెళ్లాల్సిన కాజల్.. చివరి వారం వరకు హౌస్ లో ఉండగలిగింది. 

Bigg Boss 5: Kajal eliminated episode highlights

Bigg Boss 5: Kajal eliminated episode
bigg boss 5
bigg boss telugu
rj kajal
kajal nagarjuna
shanmukh