Advertisement

అఖండ తెలుగు సినిమాకు వెలుగునివ్వాలి: బన్నీ

Sat 27th Nov 2021 11:29 PM
allu arjun,balakrishna,akhanda pre release event,akhanda movie  అఖండ తెలుగు సినిమాకు వెలుగునివ్వాలి: బన్నీ
Allu Arjun Speech at Akhanda Pre Release event అఖండ తెలుగు సినిమాకు వెలుగునివ్వాలి: బన్నీ
Advertisement

నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలు.. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదు.. ఈ నాటి ఈ బంధం ఏనాటిదో. మా తాతగారు వంటింటికి వెళ్లేవారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఆయన నాకు తండ్రిలాంటి వారు. బోయపాటి గారి సినిమా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనతో నేను భద్ర సినిమా చేయాలి.. కానీ అప్పుడు ఆర్య సినిమా కోసం వెళ్లాను.. అప్పుడే బోయపాటి గారు పెద్ద దర్శకుడు అవుతారని నాకు నమ్మకం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్.. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ఎదిగారు. మీ జర్నీ చూశాను.. మనతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది. నేను పైకి వెళ్తుంటే కూడా బోయపాటి గారు ఆనందిస్తుంటారు. మంచి సినిమా కాదు.. మెట్టు ఎక్కే సినిమా చేయాలి అనేవారు. అలానే నాతో సరైనోడు అనే సినిమాను తీశారు. 

బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూశాను. పూనకాలు వచ్చేలా ఉంది. తాండవంలా ఉందని తమన్ అన్నాడు. తమన్ మామూలు ఫాంలో లేడు.. ముట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండమైన హిట్ సాధించాలి. ఓ సినిమాను ఇన్ని రోజులు ఆపారంటే.. అది ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రగ్యా జైస్వాల్ గురించి నాకు బాగా తెలుసు. ఎంతో మంచి నటి. ఆమెకు ఈ సినిమా బూస్ట్ ఇస్తుంది. శ్రీకాంత్ అన్నయ్య మనసు ఎంతో మెత్తనైంది. ఈయన ఒక విలన్ కారెక్టర్ ఎలా వేయగలరు అని అనుకున్నాను. కానీ బోయపాటి గారు మార్చేశారు. ఇకపై కొత్త శ్రీకాంత్‌ను చూడాలని కోరుకుంటున్నాను.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ఆల్ ది బెస్ట్. బాలకృష్ణ గారికి ఈ లెవెల్‌లో ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరు. రెండు మూడు పెజీల డైలాగ్స్ చెప్పినా అదే ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ డిక్షన్ అనేది మహానుభావులు ఎన్టీఆర్ గారి వల్లే కుదిరింది. ఆ తరువాత కేవలం బాలయ్య గారే చెప్పగలరు. రీల్‌లో అయినా రియల్‌లో అయినా.. ఆయన రియల్‌గానే ఉంటారు. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారు. 

మనం అనుకున్నది చేయగలగడం, అనుకున్నట్టు ఉండటం చాలా కష్టం. కానీ బాలయ్య గారు అలా ఉంటారు. నాకు పర్సనల్‌గా ఆయనలో ఇష్టమైంది అదే. మనిషి మనసులో ఏం పెట్టుకోకుండా ఇలా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడో అని అనుకునే వాడిని.. అందుకే ఆయనకు ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిందేమో అని అనుకున్నాను. నాకు చాలా పర్సనల్‌గా నచ్చిన విషయం అది. అఖండమైన విజయాన్ని సాధించాలి.. చిన్న సినిమాల మీద చాలా మందికి సింపతి ఉంటుంది. వారికి ఓటీటీలున్నాయి. కానీ పెద్ద సినిమాలకు వచ్చిన కష్టం మామూలు విషయం కాదు. ప్రస్తుతం అంతా కూడా సినిమా గెలవాలని అంటున్నారు. సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలని అందరం కోరుకుటున్నాం.. ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతోన్న పుష్ప ఆ తరువాత రాబోతోన్న ఆర్ఆర్ఆర్..అలా ముందుకు వెళ్లాలి..ఇండస్ట్రీ గెలవాలి.. నన్ను ఇలా పిలిచినందుకు అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు.. సినిమా తగ్గేదే లే.. మీ అందరి కోసం జై బాలయ్య అని అన్నారు.

Allu Arjun Speech at Akhanda Pre Release event:

Allu Arjun at Akhanda Pre Release event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement