Advertisement

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Sun 28th Nov 2021 12:47 AM
akhanda movie,akhanda pre release event,balakrishna akhanda movie,balakrishna,rajamouli,allu arjun at akhanda pre release event  అఖండ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌
Akhanda Pre Release Event అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
Advertisement

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో..

Click Here👉 Akhanda Pre Release Event Photos

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. బోయపాటి గారికి థ్యాంక్స్. ఈ ఆడిటోరియంకే కాకుండా.. మొత్తం ఇండస్ట్రీకి ఊపును తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లు అరుపులు కేకలతో నిండిపోవాలి. మాకు ఇప్పుడు ఎంత ఆనందం వచ్చింది.. తెలుగు వాళ్లందరికి అదే ఆనందం రావాలి.. రావాలి కాదు.. కచ్చితంగా వస్తుంది అని చెబుతున్నా. బాలయ్య బాబు ఒక ఐటమ్ బాంబు.. ఎలా ప్రయోగించాలో శ్రీనుకు తెలుసు. ఆ సీక్రెట్ ఎంటో శ్రీను చెప్పాలి. బాలయ్య బాబు కూడా ఎనర్జీ సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు మనం చూసింది మచ్చు తునకే. సినిమాలో ఇలాంటివి బోలెడు ఉంటాయి. అఖండ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్‌లో చూస్తాను. అఖండ చాల పెద్ద హిట్ అవ్వాలి. ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలి. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాతకు అందరికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. ఈవెంట్‌కు వచ్చినందుకు బన్నీ, రాజమౌళికి థాంక్స్. ఇండస్ట్రీకి శివుడి లాంటి మనిషి బాలయ్య. బాలయ్య ఎంతో ఆధ్యాత్మికం. లాస్ట్ 48 రోజులు అఖండ కోసమే పని చేస్తున్నాను. కాశీకి వెళ్లిపోయిన ఫీలింగ్ వచ్చింది. బాలయ్య ట్రాన్స్‌ఫార్మర్ అయితే.. ఆయనకు కరెక్ట్ వోల్టెజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి. నేను నా కెరీర్‌లో వాయించింది ఫస్ట్ సినిమా భైరవ దీపం. అప్పుడు నాకు పన్నెండేళ్లు. అప్పుడు నాకు 30 రూపాయలు ఇచ్చారు. అఖండ సంగీతం అందించినందుకు రుణపడి ఉన్నాను. నాకు దేవున్ని చూస్తున్నట్టే ఉంది. ఇంకా అఖండ ట్రాన్స్‌లోనే ఉన్నాను. థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పెద్ద ఎన్టీఆర్ పనిచేసిన ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం అని అన్నారు.

దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ఎన్‌బీకే అంటే ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ, ఒక విస్ఫోటనం. మాస్ గాడ్ అంటే బాలయ్య. అభిమానుల్లో ఒకడిగా నేను ఇక్కడికి వచ్చా. సమర సింహా రెడ్డి సినిమా టికెట్ల కోసం ఒంగోలులో రెండు రోజులు లాకప్‌లో ఉన్నా. బోయపాటి శ్రీను మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. సింహా, లెజెండ్‌లను మించి అఖండ బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా అదిరిపోయిందని థమన్ చెప్పాడు. అఖండ ఫస్ట్ లుక్ నుంచి థియేటర్ ట్రైలర్ వరకు మాస్‌కు కావాల్సిన స్టఫ్ ఉంది. శ్రీకాంత్ గారు అంతా స్ట్రాంగ్‌గా ఉంటే.. బాలయ్య గారు ఇంకా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో ఊహించుకోండి అని అన్నారు..

లిరిసిస్ట్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవరైన నమ్మడం కష్టం. బోయపాటి శ్రీను రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను ఇక్కడ రాస్తున్నా సాహిత్యానికి స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. నాకు అవకాశం ఇచ్చిన బోయపాటికి, బాలయ్యకు, థమన్‌ గారికి థాంక్స్ అని అన్నారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. నాన్న గారు బాలకృష్ణ గారికి పాడిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మీకు తెలుసు. బాలయ్యకు పాడే అవకాశం ఇచ్చినందుకు థమన్‌కు థాంక్స్. నాన్న గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు.. అర్చనలు చేయించి, ఫోన్ చేసి కనుక్కునేవారు. ఆయన ఈ వేదికపై నుంచి థాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ ఎనర్జీ చూస్తుంటే.. డిసెంబర్ 2న థియేటర్లలో దబిడి దిబిడే. బోయపాటి- బన్నీ కాంబినేషన్‌లో సరైనోడ్ చేశాను.. అది సూపర్ హిట్. బాలయ్యతో ఇది రెండో సినిమా.. శ్రీరామ రాజ్యంలో లక్ష్మణుడిగా చేశాను.. ఇప్పుడు రావణసురుడిగా చేస్తున్నాను. నా సాఫ్ట్ ఫేస్‌ను బోయపాటి ఇలా చూపించారు. సరైనోడ్ తర్వాత బోయపాటి విలన్ చేస్తానని చెప్పాడు. బాలయ్యతో విలన్‌గా చేయడం ఈజీ కాదు. ఆయన ఎనర్జీ తట్టుకోవడం ఈజీ కాదు. ఆయన డైలాగ్స్ హై ఓల్టేజ్‌లో ఉంటాయి. నా గెటప్‌ కోసం బోయపాటి చాలా కష్టపడ్డారు. అద్దంలో చూసుకుని నేను కాదులే వరదరాజులు అని అనుకున్నాను. బాలకృష్ణ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన ఎనర్జీ సూపర్. బాలయ్య బాబు చాలా ప్రోత్సహించారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీతో ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. సినిమా ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి చెప్పినట్టుగా మహమ్మారి తర్వాత ఈ సినిమాతో థియేటర్లు నిండిపోతాయి అని అన్నారు.

పూర్ణ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి థాంక్స్. ఇన్నేళ్ల తర్వాత పెద్ద మూవీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా సినిమాల్లో రొమాంటిక్‌గా కనిపించే శ్రీకాంత్‌ను.. ఈ సినిమాలో చూస్తే భయంగా ఉంది. బాలయ్యతో పనిచేయడం చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఆయన ఎనర్జీ సూపర్. ఆయన గాడ్ ఫాదర్‌లా అనిపించారు. కేరళకు తెలుగు సినిమాలు బన్నీ వల్లే వచ్చాయి అని అన్నారు.

ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ఈరోజు చాలా హ్యాపిగా ఉంది. ఈ సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎపిక్ అవుతుందని మొదటి నుంచి అనుకున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు బోయపాటికి థాంక్స్. బాలయ్య గారికి థాంక్స్. ఆయన ఎనర్జీ, పాజిటివిటీ సూపర్. మీతో కలిసి పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం. నిర్మాతకు థాంక్స్. ఈవెంట్‌కు వచ్చినందుకు బన్నీకి, రాజమౌళి గార్లకు థాంక్స్. అందరూ డిసెంబర్ 2న థియేటర్లలో అఖండ సినిమాను చూసి పెద్ద హిట్ చేయండి.

Click Here👉 Pragya Jaiswal Photos

ఫైట్ మాస్టర్ మాట్లాడుతూ.. లక్ష్మి నర్సింహ, సింహా.. తర్వాత బాలయ్యతో ఇది మూడో సారి. రెండో పాత్ర వచ్చినప్పుడు ఫైట్స్ అదిరిపోతాయి. ఇంకో పదేళ్లలో ఇలాంటి ఫైట్స్ ఇప్పట్లో రావు. కెవిన్, స్టీవెన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. బోయపాటి, బాలయ్య ఎనర్జీ సూపర్ అని అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన రాజమౌళి, అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్. మీ అందరి ఉత్సాహం చూస్తున్నాను. క్షమాపణ చెబుతున్నా. అవుట్ డోర్‌లో చేద్దామని అనుకున్నాను. కానీ వెదర్ బాగా లేదని, వర్షం పడేలా ఉందని ఇలా చేశాం. ఈ సినిమాలో బాలయ్య గారు ఎంతో అందంగా ఉంటారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 2న మీ అందరి ముందుకు రాబోతోంది. 2020 మార్చి ఎలా ఉంది.. థియేటర్లోనే సినిమా చూడాలనే ఆనవాయితి. దానికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్‌ని మళ్లీ అఖండతో ప్రారంభిస్తున్నాం. అ లెగసినీ పుష్ప రాజ్ గానీ, ఆర్ఆర్ఆర్ గానీ ముందుకు తీసుకెళ్తాయి. పాత రోజులు మళ్లీ వస్తాయి. సౌత్‌లో కరోనా భయం లేదు. ఆర్ఆర్ఆర్‌తో నార్త్‌లో కరోనా భయాన్ని పోగొట్టేయాలి. కష్టపడేవాడిని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అందుకే బన్నీకి సక్సెస్ వస్తుంది. సినిమా మొదలవుతుంది. జాతర మొదలవుతుంది. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం అని అన్నారు..

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. జై బాలయ్య.. అనేది ఎప్పుడు నేను చెప్పుకుంటూనే ఉంటాను. టైమ్ అవుతుంది కాబట్టి తక్కువే మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. బన్నీకి, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. గుండెల మీద చేయి వేసుకుని చూసి బయటకు వచ్చేంతా.. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని అడుగు’ అది డైలాగ్. డ్యాన్స్ మాస్టర్స్ భాను, శంకర్‌లు, తొలి రెండు ఫైట్స్.. రామ్ లక్ష్మణ్ చేశారు. తర్వాత స్టంట్ శివ, కెవిన్, స్టీవెన్ మాతో పాటు ట్రావెల్ అయ్యారు. థమన్ అద్బుతమైన సాంగ్స్ అందించారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్‌కు హాట్సాఫ్. 21 నెలలుగా మా వెనక ఉన్న మా సినిమా నిర్మాతకు థాంక్స్. బాలకృష్ణ చేయి ఇలా కావడానికి నేనే కారణం. సాంగ్ చేసిన తర్వాత.. స్ట్రెచింగ్ చేయాలి. అయితే జై బాలయ్య సాంగ్ తర్వాత ఇంటికెళ్లి ఆయన స్ట్రెచింగ్ చేస్తుండగా.. కాలు జారి పడిపోయాడు. కానీ అప్పటికే కోటిన్నరతో తెల్లారి షూట్ కోసం సెట్ చేసింది. రాత్రి ఈ విషయం నాకు తెలిసింది. పొద్దున సెట్‌కు రాగానే సాంగ్ ఆపేద్దామని చెప్పాను. కానీ బాలయ్య గారు ఫ్యాన్స్ కోసం చేయాలి.. చేస్తాను అన్నాడు. బాబు ఆలోచించండి.. దిగిన తర్వాత నేను ఊరుకోను అన్నారు. కానీ బాలయ్య అందుకు ఒప్పుకున్నారు. చేయి లేవకున్నా.. లోపల కట్టి చేసిన సాంగ్ ఇది. షోల్డర్ పెయిన్‌తోనే ఆయన సాంగ్ చేశారు. నేను ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపిగా ఫీలవుతున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి హెల్ఫ్ చేసింది బన్నీ బాబు. ఆ తర్వాత కెరీర్ స్టార్ చేసి.. ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. ఇద్దరి ముందు ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 2న అఖండ రిలీజ్ అవుతుంది. బన్నీ ఈరోజు ఎంత ఎంకరేజ్ ఇస్తున్నాడో.. ఇదే ఎనర్జీతో పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ కూడా ముందుకు నడిపించాలి. అందరూ కలిసి త్రిపుల్ ఆర్‌ను ముందుకు నడిపించాలి. బీమ్లా నాయక్‌ను ముందుకు నడిపించాలి. అఖండతో నేను గెలవాలని అనుకోలేదు.. సినిమా గెలవాలని అనుకున్నాను. సుకుమార్ గెలవడం కాదు.. పుష్ప గెలవాలి. సినిమానే గెలుస్తూ ఉండాలి. ఈ సినిమాకు నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది.. డ్రైవర్స్ యూనియన్, ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ బాయ్స్, క్రొకైడల్ జోన్‌లో నాతో నడిచిన సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, నా ఫైట్ మాస్టర్, నా లైట్ ఆఫీసర్స్. నా కెమెరా అసిస్టెంట్స్. కర్ణాటక ఫారెస్ట్, పోలీస్.. డిపార్ట్‌మెంట్స్ చాలా థాంక్స్ అని అన్నారు.

Akhanda Pre Release Event:

Akhanda Pre Release Event Speeches

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement