Advertisement

నాగ‌చైత‌న్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్

Tue 23rd Nov 2021 04:34 PM
thank you movie,thank you movie first look,naga chaitanya,naga chaitanya thank you movie,vikram kumar  నాగ‌చైత‌న్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్
Thank You Movie first look నాగ‌చైత‌న్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్
Advertisement

న‌వ యువ సామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం థాంక్యూ. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌, మాట‌ల‌ను అందించారు.  రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 23)న అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా థాంక్యూ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని కాస్త గ‌డ్డంతో ఉన్న అక్కినేని నాగ‌చైత‌న్య తిరునాళ్ల‌లోని తిరిగే రంగుల రాట్నంలోని గుర్రంపై ఎక్కి కూర్చుని తిరుగుతూ సంతోష ప‌డుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ...

నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మా థాంక్యూ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్ప‌టి వ‌రకు నాగ‌చైత‌న్య చేయన‌టువంటి ఓ వైవిధ్య‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. యాక్ట‌ర్‌గా ఆయ‌నలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే చిత్ర‌మిద‌ని క‌చ్చితంగా, న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. బి.వి.ఎస్‌.ర‌వి అందించిన అద్భ‌తుమైన క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్‌గారు మ‌రింత గొప్ప‌గా సినిమాగా మ‌లిచారు మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్, ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ , ఎడిట‌ర్ న‌వీన్ నూలి .. ఇలా ఓ బెస్ట్ సినిమాను అందించ‌డానికి బెస్ట్ టీమ్ వ‌ర్క్ చేసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అన్నారు. 

Thank You Movie first look :

Thank You Movie first look launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement