Advertisement

నాని చేతుల మీదుగా జయమ్మ పంచాయితీ సాంగ్

Tue 23rd Nov 2021 04:32 PM
natural star nani,thippagalana song,suma kanakala,vijay kumar kalivarapu,vennela creations,jayamma panchayathi movie  నాని చేతుల మీదుగా జయమ్మ పంచాయితీ సాంగ్
Suma Kanakala Jayamma Panchayathi Song Launch నాని చేతుల మీదుగా జయమ్మ పంచాయితీ సాంగ్
Advertisement

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్నఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీవపాళి సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

నేడు ఈ సినిమాలోని మొదటి పాట తిప్పగలనా? లిరికల్ వీడియోను నేచుర‌ల్ స్టార్‌ నాని విడుదల చేశారు. ఇందులో విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఈ పాటలో సుమ ఫ్యామిలీని కూడా చూపించారు.

ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.

అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు

Suma Kanakala Jayamma Panchayathi Song Launch:

Natural Star Nani Launched First Lyrical Thippagalana From Suma Kanakala, Vijay Kumar Kalivarapu, Vennela Creations Jayamma Panchayathi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement