Advertisement

అసలు బిగ్ బాస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు

Sat 14th Aug 2021 01:48 PM
surekha vani,surekhavani,not going,bigg boss house,bigg boss 5  అసలు బిగ్ బాస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు
Bigg Boss 5: Surekha Vani Not Interested to participate అసలు బిగ్ బాస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు
Advertisement

నటి సురేఖ వాణి భర్త మరణం తర్వాత తన టీనేజ్ కూతురు తో కలిసి సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్ట్ లు పెడుతుంది. భర్త మరణానికి ముందు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సురేఖ వాణి.. ఆ తర్వాత కూతురు తో కలిసి బర్త్ డే పార్టీలు, పబ్బులు, మిడ్ నైట్ పార్టీలు అంటూ మాములుగా రచ్చ చెయ్యడం లేదు. దానితో ఆమెని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ కూతురుతో కలిసి తాను చెయ్యాలి అనుకున్నది చేసి చూపిస్తుంది. ఇక ఈమధ్యన సురేఖ వాణి బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లబోతుంది అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అప్పుడప్పుడు సురేఖ వాణి కూతురు బిగ్ బాస్ న్యూస్ లని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డిలేట్ చెయ్యడంతో.. సురేఖ వాణి నిజంగానే బిగ్ బాస్ కి వెళుతుంది అనుకుంటున్నారు. 

అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడుతూ తన తల్లికి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని, ఎలాంటి ఆఫర్ ఇచ్చినా అమ్మ బిగ్ బాస్ కి వెళ్లాదని, బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ మీదే అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు బిగ్ బాస్ కి ఇంట్రెస్ట్ లేకుండా ఎలా వెళుతుంది అంటూ ప్రశ్న వేస్తుంది. దానితో సురేఖ వాణి బిగ్ బాస్ కి వెళ్లదని ఓ క్లారిటీ వచ్చేసింది నెటిజెన్స్ కి. ఇక బిగ్ బాస్ 5 సెప్టెంబర్ 5 నుండి మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. 

Bigg Boss 5: Surekha Vani Not Interested to participate:

Surekha vani Not Going to Bigg Boss House

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement