శృతి ఈ రేంజ్ లో రెచ్చిపోతుందేమిటి

కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యి.. ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కోలీవుడ్ భామ శృతి హాసన్.. ఆ ప్రియుడిని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా చెప్పారు. కానీ ఏమైందో ఏమో.. అతనితో బ్రేకప్ చేసుకున్న శృతి హాసన్ కి కెరీర్ గుర్తుకు వచ్చింది. దానితో.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఫిలిమ్స్ తో సక్సెస్ కొట్టిన శృతి హాసన్ మరో బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. తన నోటితో చెప్పకపోయినా.. ఆర్టిస్ట్ శంతను హజారిక ప్రేమలో మునిగి తెలుస్తుంది. ఇక ప్రియుడు శంతను హజారిక తో కలిసి శృతి హాసన్ చెయ్యని రచ్చ లేదు.
ఈమధ్యనే సూపర్ మార్కెట్ లో శంతను హజారిక మీద కాలు పెట్టి అందరూ షాకయ్యే భంగిమని చూపించిన శృతి హాసన్ అతడిని ముద్దుల్లో ముంచెత్తింది. తాజాగా రెండ్రోజుల క్రితం తమ ఇంట్లోనే శ్రుతీ హాసన్ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసి పిచ్చెక్కించింది. శృతి హాసన్ తో పాటుగా డాన్స్ చేసిన శాంతను మీద అనుకోకుండా శృతి హాసన్ వచ్చి పడేసరికి ఆఖరికి శంతను కూడా షాకయ్యాడు. ఇక శంతను తన ఆర్ట్స్ ని బోర్డు మీద కాకుండా శృతి నడుమ మీద వేసి.. రొమాంటిక్ గా రెచ్చిపోయాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయి.
రీసెంట్ గా శృతి హాసన్ తన కాళ్ళకు వేసుకునే సాక్స్ మీద తన పిక్ పెయింటింగ్ వేయించుకుని తన కాళ్ళకి వేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ సాక్స్ మీద శృతి పెయింటింగ్ చూసి ఆఖరికి శాంతను కూడా నవ్వేసాడంటే శృతి పిచ్చి పీక్స్ లో ఉందనిపించడం లేదూ.
Shruti Haasan and boyfriend Santanu Hazarika do not shy away from showing their crazy side on social media
Shruti Hassan with her boyfriend on social media







































