గ్లామరస్ లుక్ లో పూజ

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఫైనల్ షెడ్యూల్ ని ఫినిష్ చేసేసి చెన్నై కి చెక్కేసింది. పూజ హెగ్డే చెన్నై కి వెళ్ళింది బీస్ట్ మూవీ షూటింగ్ కోసం. విజయ్ తో ఫస్ట్ టైం జోడి కడుతున్న పూజ హెగ్డే బీస్ట్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటుంది. గత మూడు రోజులుగా పూజ హెగ్డే చెన్నై లోనే స్టే చేసింది. అక్కడ స్పెషల్ సెట్స్ లో బీస్ట్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇక పూజ హెగ్డే తెలుగులో ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ లు కూడా చేస్తుంది. ఆ సినిమాల షూటింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్తో పూజ జోరు మాములుగా లేదు. 

గ్లామర్ తోనే అందాలను ఆరబోస్తూ అవకాశాలు పట్టేస్తున్న పూజ హెగ్డే కి సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ ఉంది. లాక్ డౌన్ లోనే కాదు.. అప్పుడప్పుడు పూజ హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా పూజ హెగ్డే పోస్ట్ చేసిన పిక్ చూస్తే వావ్ పూజ గ్లామరస్ లుక్ లో అదరగొట్టేసింది అనకుండా ఉండలేరు. బ్లాక్ డ్రెస్ లో పూజ హెగ్డే లూజ్ హెయిర్ తో కిక్కిచ్చే కళ్ళతో నెల మీద కూర్చుని ఇచ్చిన ఫోజు చూస్తే యూత్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం. మరి పూజ హెగ్డే గ్లామర్ లుక్ ని ఓ లుక్కెయ్యండి. 

Pooja hegde latest look viral

Pooja Hegde in Glamorous look
pooja hegde
pooja hegde latest look
pooja hegde latest look viral
pooja hegde glamorous look