Advertisement

ఇండియా కరోనా అప్ డేట్

దేశంలో సెకండ్ వేవ్ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్తగా ఇన్దిలో కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి. 81 రోజుల తర్వాత దేశంలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మరణాల సంఖ్య కూడా 1500 వద్దే నమోదవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 2,98,81,965. గడిచిన 24 గంటల్లో 1576 మంది కరోనాతో మృతి చెందారు. 

ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,86,713కి చేరింది. ఇక కొత్తగా 87,619 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 2,87,66,009కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,29,243కి తగ్గి ఆ రేటు 2.44 శాతానికి చేరింది. 

Coronavirus News updates

India Today Covid 19 Cases
coronavirus
covid 19
corona news updates
india